Begin typing your search above and press return to search.

మెగా రిలాక్సేషన్‌ మొదలైంది!!

By:  Tupaki Desk   |   30 Oct 2015 5:49 AM GMT
మెగా రిలాక్సేషన్‌ మొదలైంది!!
X
రామ్‌ చ‌ర‌ణ్ ప్రాణం పెట్టి ప‌నిచేసిన సినిమా బ్రూస్‌ లీ. ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఫ్లాప్ అన్న టాక్ తెచ్చుకుంది. అయితే ప‌రాజ‌యంలోనూ ఈ సినిమా 40కోట్లు పైగానే వ‌సూలు చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అయితే జ‌యాప‌జ‌యాలు స‌హ‌జం. వాటిని ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌ని చ‌ర‌ణ్ అన్నాడు. అన్న‌ట్టే ఇప్పుడు రిలాక్స‌వ్వ‌డానికి అమెరికా వెళ్లిపోయాడు. చ‌ర‌ణ్ అమెరికా వెళ్లే ముందే త‌న స్నేహితుడు స‌ల్మాన్‌ ఖాన్ న‌టించిన ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో తెలుగు అనువాదం పూర్తి చేశాడు. దాదాపు రెండు వారాలు ఈ సినిమా కోసం ప‌నిచేశాడు. ప‌నుల‌న్నీ అయ్యాక అమెరికా వెళ్లాడు. ఇప్పుడు అక్క‌డ బిజీ షెడ్యూల్స్‌ తో వ‌చ్చిన బ‌డ‌లిక నుంచి సేద‌దీరి కొద్ది రోజుల విరామం త‌ర్వాత‌ తిరిగి ఇండియా తిరిగి వ‌స్తాడు. వ‌స్తూనే త‌ర్వాతి సినిమాలు ఏంటి? అన్న‌ది ఆలోచిస్తాడు.

ఇప్ప‌టికే చ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ హిట్ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్‌ కి సంబంధించిన ప‌నులు సాగుతున్నాయి. ఈ సినిమా స్ర్కిప్టు ప‌నుల్లో సురేంద‌ర్‌ రెడ్డి బిజీగా ఉన్నాడు. చ‌ర‌ణ్ అమెరికా నుంచి తిరిగి రాగానే బౌండ్ స్ర్కిప్టును వినిపించి ఓకే చేయించే బాధ్య‌త సూరిదే. ఈలోగానే బాబాయ్ ప‌వ‌న్ కల్యాణ్ నిర్మాత‌గా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వేరొక సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నాడు చెర్రీ. త‌ని ఒరువ‌న్ రీమేక్ పూర్త‌యిన త‌ర్వాత త్రివిక్ర‌మ్‌ తో సినిమా ఉంటుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఏది ముందు? ఏది వెనుక‌? అన్న‌ది ఇప్ప‌టికింకా క్లారిటీ లేదు. ఏ స్ర్కిప్టు ముందుగా మెప్పిస్తుందో అందులో న‌టించే ఛాన్సుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి.