Begin typing your search above and press return to search.

ఇస్మార్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఉస్తాద్!

By:  Tupaki Desk   |   30 Sept 2019 8:50 PM IST
ఇస్మార్ట్ గిఫ్ట్ ఇచ్చిన ఉస్తాద్!
X
చాలామందే డైరెక్టర్లు ఉంటారు కానీ పూరి జగన్నాధ్ మాత్రం ఒక స్పెషల్ లీగ్. డైరెక్టర్ గా పూరి కెరీర్ ముగిసిపోయిందని విమర్శకులు తీసిపారేసే సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ కావడం.. బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చూపడం పూరికి చాలా కామన్. రీసెంట్ గా 'ఇస్మార్ట్ శంకర్' తో అదేపని చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తను ఫాం లోకి రావడమే కాదు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను కూడా సూపర్ ఫామ్ లోకి తీసుకొచ్చాడు. దీంతో పూరి - రామ్ లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

పూరి రీసెంట్ గా 28 వ తారీఖున తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఇండస్ట్రీలో కూడా పూరి పుట్టినరోజు సందర్భంగా పూరికి శుభాకాంక్షలు చెప్పడం లాంటి హడావుడి కనిపించింది. ఇక పూరి టీమ్ తరఫున ఛార్మీ కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోని వారికి నగదు సహాయం కూడా చేశారు. ఇదిలా ఉంటే ఈ పుట్టిన రోజు సందర్భంగా హీరో రామ్ పూరికి ఓ ఇస్మార్ట్ గిఫ్ట్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఛార్మి తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.

"పూరి జగన్ కు మీరిచ్చిన అద్భుతమైన బర్త్ డే గిఫ్ట్ కు.. లవ్ యూ ఉస్తాద్ రామ్... జగన్ గారు ఆకాశంలో తేలిపోతున్నారు" అంటూ ట్వీట్ చేశారు ఛార్మీ. దీంతో పాటు ఆ బహుమతికి సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే హై క్వాలిటీ ఉండే గోల్డ్ ఫాంటమ్ వైర్ లేస్ స్పీకర్స్. ఈ స్పీకర్స్ ధర నాలుగు వేల డాలర్ల వరకూ ఉంటుంది. ఛార్మీ షేర్ చేసిన వీడియోలో పూరి 'ఇస్మార్ట్ శంకర్' పాటలను ఈ స్పీకర్లలోనే వింటూ ఉత్సాహంగా కనిపించారు. ఏదేమైనా ఇస్మార్ట్ రామ్ టేస్టే వేరబ్బా!

వీడియో కోసం క్లిక్ చేయండి