Begin typing your search above and press return to search.

#ర‌కుల్ టిప్‌.. కోవిడ్ ఆందోళ‌న నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌కపోతే?

By:  Tupaki Desk   |   6 Jun 2021 9:30 AM GMT
#ర‌కుల్ టిప్‌.. కోవిడ్ ఆందోళ‌న నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌కపోతే?
X
ముంబై టు హైద‌రాబాద్ ర‌కుల్ బిజీ షెడ్యూల్స్ గురించి తెలిసిందే. ఇటీవ‌ల వ‌రుస షూటింగుల‌తో బిజీ అయిన ఈ బ్యూటీకి అనూహ్యంగా కోవిడ్ సోకిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత చికిత్స‌తో కోలుకున్న ఈ బ్యూటీ త‌న‌కు ఎదురైన తీవ్ర ఒత్తిడి గురించి వెల్ల‌డించింది.

మ‌హ‌మ్మారీ భ‌యం నిదుర ప‌ట్ట‌నివ్వ‌దు. అలాంట‌ప్పుడు దాని నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే క‌చ్ఛితంగా యోగా నిద్ర‌ను ఆశ్ర‌యించాల‌ని ర‌కుల్ తెలిపింది. తాను నిదుర‌లేమిని ఎదుర్కొన్నాన‌ని దానినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌న యోగా శిక్ష‌కుడి స‌ల‌హాలు తీసుకున్నాన‌ని తెలిపింది.

ర‌కుల్ కొంత‌కాలంగా షూటింగుల‌కు దూర‌మైంది. మేకప్ ఆర్టిస్టులు హెయిర్‌స్టైలిస్టుల బృందాన్ని కూడా మిస్స‌వుతోంది. ర‌కుల్ ప్ర‌స్తుతం బొమ్మలు వేసే మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. త్వరలో మళ్లీ షూటింగ్ ప్రారంభించడానికి చిత్రనిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏదీ అనుకూలంగా లేదు.

ఆ క్ర‌మంలోనే మహమ్మారికి సంబంధించిన ఒత్తిడి ఆందోళన గురించి సోషల్ మీడియా సూచ‌న‌ల్లో ప్రజలకు ఒక పరిష్కారం అందించే ప్ర‌య‌త్నం చేసింది. ర‌కుల్ యోగా నిద్ర చేస్తున్న ఫోటోను పంచుకుంది. ``నేను నిద్రపోలేని ఒత్తిడితో ఉన్న‌ప్పుడు యోగా నిద్రా సెషన్ తో వ్యాయామానంత‌రం నేను ఈ విధంగా విశ్రాంతి తీసుకుంటాను. నా వెల్నెస్ నిపుణుడు మున్మున్ గనేరివాల్ సూచించినట్లు చేస్తాను. మహమ్మారి ఆందోళన మిమ్మల్ని నిద్రలేనివాళ్లుగా.. ఒత్తిడికి గురిచేస్తోంది లేదా మీరు కోవిడ్ నుంచి కోలుకుంటుంటే యోగా నిద్ర‌కు రెడీగా ఉండండి..అని తెలిపింది.

ర‌కుల్ ప్రీత్ సింగ్ తదుపరిసారి అజయ్ దేవ్ గన్ దర్శకత్వం వహిస్తున్న‌ `మేడే`లో క‌థానాయికగా న‌టిస్తోంది. భార‌తీయుడు 2లోనూ ఒక నాయిక‌. క్రిష్ తెర‌కెక్కించిన కొండ‌పొలం రిలీజ్ కావాల్సి ఉంది. అనుభూతి కశ్యప్ క్యాంపస్ కామెడీ-డ్రామా `డాక్టర్ జి` లోనూ ర‌కుల్ న‌టిస్తోంది. ఆయుష్మాన్ ఖుర్రానా ఇందులో హీరో. రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న `ఛత్రివాలి`లో.. ఇంద్ర కుమార్ `స్లైస్ ఆఫ్ లైఫ్ కామెడీ`లో కూడా ఆమె నటించనుంది.