Begin typing your search above and press return to search.

‘తెర వెనుక’ చిత్రం చూసిన రకుల్..

By:  Tupaki Desk   |   2 Jan 2021 6:00 PM IST
‘తెర వెనుక’ చిత్రం చూసిన రకుల్..
X
అటు నార్త్.. ఇటు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా దూసుకెళ్తోంది రకుల్ ప్రీత్ సింగ్. అయితే.. ఇప్పుడు తన తమ్ముడిని కూడా వెండి తెరకు పరిచయం చేస్తోంది ఈ బ్యూటీ. తన అందం అభినయంతో ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు తన సోదరుడిని కూడా ఆశీర్వదించాలని కోరుతోంది.

ఆమె సోదరుడు అమన్ హీరోగా రూపొందించిన చిత్రం ‘తెరవెనుక’. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రకుల్ సోదరుడు. ధిమాన్‌, దీపికరెడ్డి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం.. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కింది. మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా.. స్వీయ రక్షణ అవసరం తప్పనిసరి అనే కథాంశంతో రూపొందిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్.. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

‘బెల్స్’, ‘బంతిపూల జానకి’ వంటి చిత్రాలను రూపొందించిన నెల్లుట్ల ప్రవీణ్‌చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మురళీ జగన్నాథ్‌ మచ్చ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీకి ర‌ఘురామ్ సంగీతం అందించారు.

రకుల్ సోదరుడు అమ‌న్ డెబ్యూ మూవీ అయిన ‘తెర వెనుక’ చిత్రాన్ని బిగ్ స్క్రీన్లో విడుద‌ల చేశారు. కాగా.. ఈ చిత్రాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి హైదరాబాద్ లోని ఓ థియేటర్లో వీక్షించారు.