Begin typing your search above and press return to search.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 6 గంటల పాటు సాగిన రకుల్ విచారణ..!
By: Tupaki Desk | 3 Sept 2021 9:00 PM ISTటాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ వేగవంతం చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి ఈడీ.. ఈరోజు శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని విచారించింది. ఉదయం నుంచి దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ విచారణలో రకుల్ ను ఈడీ అధికారులు 30కి పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. 2016లో ఎఫ్-క్లబ్ లో నిర్వహించిన ఒక పార్టీకి రకుల్ హాజరవ్వగా.. అదే పార్టీలో చాలా మంది ప్రముఖులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా రకుల్ ఈ పార్టీకి హాజరైనట్లు అధికారులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఎఫ్ క్లబ్ మేనేజర్ - రకుల్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఈడీ కనుగొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే రకుల్ ప్రీత్ తో పాటుగా ఎఫ్ క్లబ్ నిర్వాహకుడు హీరో నవదీప్ - మేనేజర్ లకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు విచారణలో రకుల్ బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. లావాదేవీలపై ప్రశ్నించినట్టు సమాచారం.
నిజానికి ఆగస్టు 6న రకుల్ ను విచారణకు రావాలని ఈడీ నోటీసులలో పేర్కొన్నారు. అయితే షూటింగ్ లతో బిజీగా ఉండటం వల్ల ఆ సమయంలో విచారణకు హాజరు కాలేనని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీని రకుల్ కోరింది. అందుకు అంగీకరించని ఈడీ అధికారులు.. మూడు రోజుల ముందుగానే రకుల్ ను విచారణకు పిలిచారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్ - నటి ఛార్మిలను సుదీర్ఘంగా ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి - 13న నవదీప్ మరియు ఎఫ్ క్లబ్ మేనేజర్ లను ఈడీ విచారించనుంది.