Begin typing your search above and press return to search.
అజయ్ తో మళ్లీ రకుల్.. ‘థాంక్ గాడ్’ అంటున్న బ్యూటీ!
By: Tupaki Desk | 8 Jan 2021 10:43 AM IST‘రకుల్ ప్రీత్ సింగ్..’ నటనకు ఎలాంటి వంకా పెట్టాల్సిన పనిలేని నటి. ఇప్పటికే సౌత్ లోని పలు ఇండస్ట్రీల్లో ఎన్నో హిట్లు తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది ఈ పంజాబీ బ్యూటీ. అయితే.. నార్త్ లోనూ సత్తాచాటి నేషనల్ హీరోయిన్ కావాలన్నది అమ్మడి డ్రీమ్. దీనికోసం గతంలో గట్టిగానే ట్రై చేసినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా.. మళ్లీ సెకండ్ ట్రయల్ స్టార్ట్ చేసింది.
బాలీవుడ్ స్క్రీన్ పై మెరిసేందుకు ఐటెం సాంగ్, గెస్ట్ రోల్, హీరోయిన్ క్యారెక్టర్ సహా.. దేనికైనా రెడీ అయిపోతోంది రకుల్. ప్రస్తుతం బీటౌన్ లో అజయ్ దేవ్ గన్ తో ‘మేడే’ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ. అజయ్ దేవ్ గన్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ ద్వారా నార్త్ లో పాగా వేయాలని ఆరాటపడుతున్న రకుల్ కు.. మరో ఆఫర్ వచ్చింది.
రకుల్ మరో కొత్త చిత్రంలో నటించబోతుండగా.. అందులోనూ హీరో అజయ్ దేవ్ గన్ కావడం విశేషం. ప్రస్తుతం అజయ్ తో సినిమా సెట్స్ లో ఉండగానే.. అదే హీరోతో మరో మూవీ అనౌన్స్ అయ్యింది. దర్శకుడు ఇంద్ర కుమార్ "థాంక్ గాడ్" పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ఈనెల 21నుంచి మొదలుకానుంది. సిద్దార్థ్ మల్హోత్రా కూడా నటిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
కాగా.. ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది రకుల్. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘అయ్యారీ’ ‘మర్జావాం’.. అజయ్ దేవ్ గన్ తో ‘దేదే ప్యారే దే’లో రొమాన్స్ చేసింది రకుల్. జాన్ అబ్రహంతో ‘అటాక్’ అనే మూవీలో కనిపించిన బ్యూటీ.. అర్జున్ కపూర్ తో "సర్దార్ అండ్ గ్రాండ్సన్" చిత్రంలోనూ నటించింది. అయితే.. ఇన్నిచిత్రాల్లో నటించినప్పటికీ.. ఆమె ఆశించిన స్టార్ డమ్ రాలేదు.
దీంతో.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది రకుల్. ఇప్పుడు ‘మేడే’ తర్వాత ‘థాంక్ గాడ్’ చిత్రంలో నటించబోతోంది. ఈ సినిమాలతో సక్సెస్ సాధించి, బాలీవుడ్ లో జెండా పాతాలని చూస్తోంది. ఈ సినిమాలు గనుక సక్సెస్ అయితే.. ఖచ్చితంగా ఈ బ్యూటీ ‘థాంక్ గాడ్’ అంటుందనడంలో సందేహం లేదు.