Begin typing your search above and press return to search.

పొడుగు కాళ్ల సుంద‌రి అనాల‌నే ఈ తంటాలు?

By:  Tupaki Desk   |   25 March 2021 7:00 AM GMT
పొడుగు కాళ్ల సుంద‌రి అనాల‌నే ఈ తంటాలు?
X
గ‌త కొంత‌కాలంగా అందాల క‌థానాయిక‌ ర‌కుల్ బాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఎక్కువ‌గా ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు ప్ర‌గ్య జైశ్వాల్ తో క‌లిసి ముంబై రెస్టారెంట్ లో పార్టీలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆ క్ర‌మంలోనే హిందీ చిత్ర‌సీమ‌లో ర‌కుల్ - ప్ర‌గ్య జోడీ పెద్ద ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌న్న టాక్ వినిపించింది.

అజ‌య్ దేవ‌గ‌న్ తెర‌కెక్కిస్తున్న మేడే చిత్రంలో న‌టిస్తున్న ర‌కుల్ ఈ సినిమాతో పాటు ప‌లు భారీ హిందీ చిత్రాల‌కు ర‌కుల్ సంత‌కాలు చేశారు. ఇటు టాలీవుడ్ లోనూ క్రిష్ తెర‌కెక్కించిన తాజా చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్ స‌ర‌స‌న న‌టించారు. అలాగే ర‌కుల్ రెగ్యుల‌ర్ ఫిట్నెస్ ప్ర‌ణాళిక‌ల గురించి.. స్టైల్ కంటెంట్ గురించి తెలిసిన‌దే.

ప్రతిసారీ సోష‌ల్ మీడియాల్లో లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో హాట్ టాపిక్ గా మారుతున్న ఈ పంజాబీ బ్యూటీ ఇటీవ‌ల మాల్దీవుల వెకేష‌న్ నుండి బికినీ లుక్ ని షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడు స‌మ్మ‌ర్ స్ప‌ష‌ల్స్ తో అల‌రిస్తోంది. తాజాగా మోడ్ర‌న్ ఔట్ ఫిట్ లో ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తున్న ఫోటోల్ని ర‌కుల్ షేర్ చేసింది. ఇక ఈ లుక్ లోనూ ర‌కుల్ తన పొడవాటి కాళ్ళ అందాన్ని ఎలివేట్ చేసింది.