Begin typing your search above and press return to search.

మహమ్మారిని జయించిన రకుల్..!

By:  Tupaki Desk   |   29 Dec 2020 1:02 PM IST
మహమ్మారిని జయించిన రకుల్..!
X
దక్షిణాది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజులుగా క్వారంటైన్ లో ఉన్న రకుల్ చికిత్స తీసుకుంటూ ఉంది. అయితే కరోనా వైరస్ బారిన పడిన రకుల్ ప్రీత్ ఇప్పుడు కోలుకుంది. తాజాగా కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలో ఆమెకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని రకుల్ తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వెల్లడించింది. ఇలాంటి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపింది రకుల్.

''నాకు కరోనా టెస్టులో నెగిటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నాను. మీ అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు. వచ్చే 2021 సంవత్సరాన్ని మంచి ఆరోగ్యంతోనూ ఆశావహ దృక్పథంతోనూ ప్రారంభిస్తాను. దయచేసి అందరూ బాధ్యతగా ఉండండి. మాస్కులు ధరించడంతోపాటు అన్ని జాగ్రత్తలూ తీసుకోండి'' అని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొంది. కాగా, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా షూటింగ్ పూర్తి చేసింది. అలానే నితిన్ తో కలిసి 'చెక్' సినిమాలో నటిస్తున్న రకుల్.. హిందీలో జాన్ అబ్రహాం సరసన 'ఎటాక్' అనే సినిమాలో నటించింది. అలానే అర్జున్ కపూర్ తో కలిసి ఓ సినిమా చేస్తోంది రకుల్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ - అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'మే డే' సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'అయలాన్' చిత్రంలోనూ రకుల్ నటిస్తోంది.