Begin typing your search above and press return to search.

ట్రోలర్లపై ఘాటు కామెంట్ చేసిన అమ్మడు!

By:  Tupaki Desk   |   24 Jun 2019 11:27 AM IST
ట్రోలర్లపై ఘాటు కామెంట్ చేసిన అమ్మడు!
X
సోషల్ మీడియాలో మంచి ఉంది.. చెడు ఉంది. దీన్ని ఎవరూ కాదనలేరు. మనలాంటి సాధారణ నెటిజన్లకంటే ఈ విషయం ముఖ్యంగా సెలబ్రిటీలకు తెలుస్తుంది.. ఎందుకంటే ట్రోలింగ్ బారిన ఎక్కువ పడేది సెలబ్రిటీలే కదా! ఒక ఉదాహరణ తీసుకుంటే అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అందరికంటే పవర్ఫుల్ అని చాలామంది అభిప్రాయం.. కానీ డోనాల్డ్ ట్రంప్ మీద ఉన్నన్ని జోకులు.. ట్రోలింగ్ మెసేజులు ఎవరిమీద మీద కూడా ఉండవు.. ఆఖరికి లిటిల్ మ్యాన్ కిమ్ ఉన్ జోంగ్ మీద కూడా అన్ని జోకులు లేవు. అంటే ప్రపంచాన్ని గడగడలాడించే అగ్రరాజ్యం అధ్యక్షుడంటే నెటిజన్లకు.. ట్రోలర్లకు లెక్క లేదు!

మరి డోనాల్డు భాయిజాన్ కే దిక్కు లేదంటే మన సినిమా సెలబ్రిటీలకు ఆ ట్రోలర్లు ఏ పాటి గౌరవం ఇస్తారు చెప్పండి? అందరినీ తగులుకున్నట్టే ఈమధ్య రకుల్ ప్రీత్ ను గట్టిగా తగులుకుంటున్నారట. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో రకుల్ ను ప్రశ్నిస్తే ట్రోలర్లను పనీపాట లేనివారంటూ కామెంట్ చేసింది. "దురదృష్టవశాత్తూ మన దేశంలో చాలామంది ఉద్యోగం సద్యోగం లేనివారు ఉన్నారు.. వారికి ఫ్రీ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వారికి అందుబాటులో ఉంది. వారికి ఏం పనిపాట లేకపోవడంతో ఇతరులను కామెంట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు" అని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

తను పోస్ట్ చేసే ఫోటోలతో తన కుటుంబ సభ్యులకు అభ్యంతరం లేనప్పుడు ఇతరుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. అంతే కాదు ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టడం వీలు కాదని చెప్పింది. రకుల్ చెప్పేది కొంతవరకూ నిజమే కానీ.. ట్రోలర్లు అందరినీ పనిపాట లేనివారని కర్వేపాకుల్లా తీసిపారేయడండం మాత్రం కరెక్ట్ కాదేమో.. ఎందుకంటే బికినీ ఫోటోలకు లైకులు కొట్టేది.. సూపర్ డూపర్ ఫెంటాస్టిక్ అంటూ కామెంట్లు పెట్టేది.. టీజర్లకు ట్రైలర్లకు ఎక్కువగా లైకులు కొట్టేది కూడా ఆ బ్యాచే. అది మర్చిపోతే ఎలా అమ్మడూ? అందరూ బిజీగా ఉండి రెండు చేతులా డాలర్లు.. పౌండ్లు సంపాదిస్తూ ఉంటే.. ఫోటోలు టీజర్లు ట్రైలర్లే కాదు అసలు మీ సినిమాలు చూసేది ఎవ్వరు?