Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్నే ఉపాసనకు ఆదర్శమట

By:  Tupaki Desk   |   15 Aug 2017 10:25 PM IST
ఆ హీరోయిన్నే ఉపాసనకు ఆదర్శమట
X
టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నా కూడా.. వారిలో ఫిట్టుగా సూపర్ హాటుగా ఉండే హీరోయిన్లు చాలా తక్కువమందే ఉన్నారు. ఎందుకంటే రోజూ జిమ్ కు వెళ్ళి బరువులు ఎత్తి ఒళ్ళు హూనం చేసుకోవాలంటే ఎవరి తరం అవుతుంది చెప్పండి? అందుకే కొంతమంది భామలు మాత్రమే ఇవన్నీ చేస్తూ.. తమ శరీరదారుఢ్యాన్ని బాగా మెయిన్టయిన్ చేస్తూ.. టాప్ హీరోయిన్లు అయిపోయారు. వారిలో సమంత 2వ స్థానంలో ఉంటే.. రకుల్ ప్రీత్ మొదటి స్థానంలో ఉంటుంది.

ఇప్పుడు రకుల్ ప్రీత్ ఫిట్నెస్ చూసి చాలామంది అసూయ పడతారామో కాని.. ఒకప్పుడు చాలా బొద్దుగా ఉన్న ఉపాసన కామినేని మాత్రం ఇనస్పయిర్ అయ్యింది. అందుకే ఆమె ఫిట్నెస్సులూ గట్రా మొదలెట్టేసి.. రామ్ చరణ్‌ వైఫ్‌ అంటే ఇది అన్నట్లు స్లిమ్మయ్యి చూపెట్టింది. ఇప్పుడు తనెలా స్లిమ్ అయ్యిందో ప్రపంచానికి చెప్పడానికి.. గత వారం రోజుల నుండి డెయిలీ ఫిట్నెస్ పేరుతో వీడియోలు షేర్ చేస్తోంది. ఈరోజు అలాంటి ఓ వీడియోలో ఏకంగా రకుల్ ప్రీత్ ను పిలిచి.. తనని చూసే నేను ఇనస్పయిర్ అయ్యాను.. అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ లో చాలామందికి ఈ ఫిట్నెస్ అనేది అలవాటైపోయింది. రకుల్.. సమంత.. రాశి ఖన్నా.. లావణ్య త్రిపాఠి.. రెజీనా.. తేజస్వి మదివాడ వంటి భామలు రోజూ నాలుగ్గంటలు జిమ్ లోనే ఉంటారట. ఇక వీరిని చూసిన ఉపాసన వంటి స్టార్ వైఫ్స్ కూడా అదే ఫాలో అయిపోతున్నారు. అది సంగతి.