Begin typing your search above and press return to search.

ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ మల్లీశ్వరిగా మారబోతుందా?

By:  Tupaki Desk   |   3 Jun 2020 5:00 AM GMT
ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ మల్లీశ్వరిగా మారబోతుందా?
X
టాలీవుడ్‌ లో దాదాపుగా యంగ్‌ స్టార్‌ హీరోలందరి రొమాన్స్‌ చేసిన ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈమె కెరీర్‌ గ్రాఫ్‌ అలా పైకి వెళ్లి ఢమాల్‌ అంటూ కింద పడిపోయింది. ప్రస్తుతం తెలుగు తమిళంలో ఈమెకు ఆఫర్లే లేవని చెప్పుకోవచ్చు. దాంతో రకుల్‌ ను ఫేడ్‌ ఔట్‌ హీరోయిన్‌ అంటున్నారు. మరికొంత కాలంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందంటున్న సమయంలో అనూహ్యంగా ఈమెకు కరణం మల్లీశ్వరి బయోపిక్‌ లో నటించే ఛాన్స్‌ వచ్చిందనే వార్తలు వస్తున్నాయి.

రచయిత నిర్మాత అయిన కోన వెంకట్‌ ఇటీవలే కరణం మల్లీశ్వరి సినిమాను ప్రకటించాడు. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందబోతున్న ఈ చిత్రంలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల గుర్తింపు ఉన్న నటిని తీసుకోవాలని భావిస్తున్నారు. మొదట నిత్యామీనన్‌ ను అనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పిందట. ఆ తర్వాత తాప్సి తో కూడా చర్చలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయితే కరణం మల్లీశ్వరి పాత్రకు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోందట.

ఫిట్‌ నెస్‌.. ఫిజిక్‌ విషయంలో రకుల్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమెకు ఫిట్‌ నెస్‌ పై ఉన్న ఆసక్తితో స్వయంగా జిమ్‌ సెంటర్లను కూడా ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. వెయిట్‌ లిఫ్టింగ్‌ తో పాటు పలు కసరత్తులు చేసిన వీడియోలు గతంలో వైరల్‌ అయ్యాయి. కరణం మల్లీశ్వరి సినిమా అంటే కసరత్తులు చాలా చేయాల్సి ఉంటుంది. కనుక ఆ పాత్రకు రకుల్‌ అయితే బాగుంటుందని కోన వెంకట్‌ అండ్‌ టీం భావిస్తున్నారట.