Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఇంట్లోకి రకుల్

By:  Tupaki Desk   |   5 Jan 2018 5:02 PM GMT
బిగ్ బాస్ ఇంట్లోకి రకుల్
X
వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో తెలుగు తెరకు పరిచయమైన రకుల్ మొన్నటి వరకు ఏ స్థాయిలో అవకాశాలను దక్కించుకుందో తెలిసిందే. ఒకసారి కెరీర్ డౌన్ అయితే వెంటన్ ఒక్క హిట్టు కొట్టి రికవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటూ వచ్చింది. కానీ అమ్మడి బ్రాండ్ స్పైడర్ నుంచి కొంచెం డౌన్ అయ్యిందా ఏంటి అనేలా టాక్ వస్తోంది. అయినా కుడా రకుల్ ఏ మాత్రం నిరాశ చెందకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది.

అయితే రకుల్ తెలుగులో మొదటి హిట్ అందుకోగానే బాలీవుడ్ లో యారియాన్ అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ నాలుగేళ్ల తరువాత మరో బాలీవుడ్ సినిమా ఆయారి ద్వారా నార్త్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎలాగైనా ఆ సినిమాతో మంచి హిట్ కొట్టాలని ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటోంది. రీసెంట్ గా బిగ్ బాస్ ఇంట్లోకి వెళుతోన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబందించిన ఫొటోని కూడా పోస్ట్ చేసి వివరణ ఇచ్చింది.

కారులో మేకప్ మెన్ తో పాటు ఆమె అసిస్టెంట్స్ కూడా ఉన్నారు. రకుల్ రెండవ హిందీ సినిమా ఆయారి పై ప్రస్తుతం మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కిస్తోన్న ఆ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా - మనోజ్ భాజ్ పేయ్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఇక ఆ సినిమా జనవరి 26న రిలీజ్ కాబోతోంది. మరి ఆ సినిమా రిజల్ట్ రకుల్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.