Begin typing your search above and press return to search.

కండోమ్ టెస్ట‌ర్ పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్..?

By:  Tupaki Desk   |   26 April 2021 6:30 AM GMT
కండోమ్ టెస్ట‌ర్ పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్..?
X
ప్ర‌యోగాలు చేయ‌నిదే ఈ రోజుల్లో జ‌నాలు గుర్తించ‌డం క‌ష్టం. ఎంచుకున్న‌ కాన్సెప్ట్ కొత్త‌గా ఉంటేనే ఆర్టిస్టుకు మైలేజ్ పెరుగుతుంది. బాలీవుడ్ లో ష‌బానా ఆజ్మీ-నందితా దాస్- ట‌బు లాంటి న‌టీమ‌ణుల ప్రయోగాలు నిరంత‌రం హాట్ టాపిక్ గా మారుతుంటాయి. ఈ వెట‌ర‌న్స్ అంతా జాతీయ ఉత్త‌మ న‌టీమ‌ణులుగా అవార్డులు అందుకున్నారు. క‌రీనా క‌పూర్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాల హీరోయిన్ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల‌తో మెప్పించారు.

ఇప్పుడు అదే బాట‌లో అందాల రకుల్ ప్రీత్ సింగ్ ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతోంది. ఓవైపు రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే ఈసారి కొత్త ఎటెంప్ట్ చేస్తోంది ర‌కుల్. ప్ర‌ఖ్యాత నిర్మాత రోనీ స్క్రూవాలా తెర‌కెక్కించే త‌దుప‌రి చిత్రంలో ర‌కుల్ కండోమ్ టెస్ట‌ర్ పాత్ర‌లో న‌టించ‌నుంది. ఇది పూర్తి హాస్య‌ప్ర‌ధాన చిత్రం. నాయికా ప్రాధాన్య‌త‌తో తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. సామాజిక సందేశం కూడా ఉంటుంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో ర‌కుల్ పాత్ర నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచే విధంగా ఉంటుంద‌ట‌.

ప్రస్తుతం ర‌కుల్ తెలుగులో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కొండ‌పొలం అనే చిత్రంలో న‌టించింది. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాతో డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ లతో కలిసి `మేడే` షూటింగ్ లోనూ ర‌కుల్ పాల్గొంటోంది. ప్ర‌స్తుతానికి సెకండ్ వేవ్ వ‌ల్ల బాలీవుడ్ షూటింగులు బంద్ అయిన సంగ‌తి తెలిసిందే.