Begin typing your search above and press return to search.

లిస్టులో ఒక్కడే మిగిలాడు రకుల్‌

By:  Tupaki Desk   |   13 March 2016 6:20 AM GMT
లిస్టులో ఒక్కడే మిగిలాడు రకుల్‌
X
ఇప్పటివరకు ఇంత తక్కువ కాలంలో మెగా హీరోలందరితో చేసిన హీరోయిన్‌ అంటే ఎవ్వరూ లేరు. ఇంకా తమన్నా అండ్‌ కాజల్‌ వంటి భామలు కూడా కేవలం చరణ్‌ అండ్‌ బన్నీతో మాత్రమే నటించారు. మరి పవన్‌ కళ్యాణ్‌ తో కూడా నటించారు.. ఆయన వేరే లీగ్‌ కాబట్టి.. అందరికీ ఆయనతో నటించడం అంటే కష్టం. ఇకపోతే ఇప్పుడు యంగ్‌ హాటీ రకుల్‌ ప్రీత్ విషయంలో ఓ మాట చెప్పాలి.

ప్రస్తుతం మెగా ఫ్యామిలీ హీరోలందరినీ వరుస పెట్టి ఊడ్చేస్తోంది రకుల్‌ ప్రీత్‌. అమ్మడు మెగా మీటర్‌ అంటూ రామ్‌ చరణ్‌ తో కలసి బ్రూస్‌ లీ సినిమాలో హాట్‌ మీటర్‌ రేంజు కొత్త హైటుకు తీసుకెళ్లింది. ఆ సినిమాలో ఆరబోసిన అందాలు చూస్తే ఎవరైనా షాక్‌ తినాల్సిందే. ఇప్పుడేమో సరైనోడు సరసన రెచ్చిపోతోందీ ఢిల్లీ బ్యూటి. అమ్మడు ఆల్రెడీ తన అందాల డోస్ తో యునిట్‌ మెంబర్లకు మతిపోగొట్టేసిందట. ఆ తరువాత శ్రీను వైట్ల డైరక్షన్‌ లో రెండోసారి చేసే ఛాన్సుంది. వరుణ్‌ తేజ్‌ సినిమాలో ఈ భామే హీరోయిన్‌. ఇంకా డేట్లు మాత్రం ఇవ్వలేదు. లేటెస్టు అప్డేట్‌ ఏంటంటే.. గోపిచంద్‌ మలినేని డైరక్షన్‌ లో సాయి ధరమ్ తేజ్‌ చేస్తున్న సినిమా కోసం మార్చి నుండి డేట్స్‌ ఇచ్చేసిందట రకుల్‌. ఆ లెక్కన చూస్తే మెగా హీరోలందరితోనూ చేసేసినట్లే.

ఇంకా అంతగా సక్సెస్‌ అవ్వని అల్లు శిరీష్‌ ను మినహాయిస్తే.. రకుల్‌ లిస్టులో ఉంది కేవలం పవర్‌ స్టార్‌ ఒక్కడే. ఆయన కూడా ఎలాగో ఇంకో 2-3 సినిమాలు చేస్తాలే అన్నాడు కాబట్టి.. అందులో ఏదో ఒకటి రకుల్‌ సైన్‌ చేసిందంటే.. అది 'మెగా' గిన్నీస్‌ రికార్డ్‌ అయిపోతుంది. ఫ్యామిలీలోని ఆల్‌ హీరోస్‌ తో నటించిన ఏకైక స్వీట్‌ హార్ట్ కేవలం ఈ భామే అవుతుంది.