Begin typing your search above and press return to search.
బాలయ్యతో రకుల్.. ఈసారి ఫుల్ టైం
By: Tupaki Desk | 8 Feb 2019 5:46 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఎంత వేగంగా పైకి లేచిందో.. అంతే వేగంగా కింద పడింది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‘ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి.. రెండేళ్లు తిరగకుండానే పెద్ద స్టార్ హీరోయిన్ అయింది. టాలీవుడ్లో మెజారిటీ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. మిగతా స్టార్ హీరోయిన్లు స్లో అవుతున్న తరుణంలోనే రకుల్ రైజ్ అయి.. నంబర్ వన్ స్టేటస్ కూడా అందుకుంది. కానీ ఆశ్చర్యకరంగా మంచి ఫాంలో ఉండగానే ఆమె కెరీర్ అనుకోని విధంగా డౌన్ అయిపోయింది. కట్ చేస్తే తెలుగులో ఆమెకు ఏడాదికి పైగా గ్యాప్ వచ్చేసింది.
గత ఏడాది తెలుగులో రకుల్ సినిమా ఏదీ విడుదలే కాలేదు. వేరే భాషల్లో అవకాశాలున్నా.. తెలుగులో కెరీర్ ఇంత డల్ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే కొత్త సంవత్సరంలో రకుల్‌కు కొంచెం కాలం కలిసొస్తున్నట్లుగా ఉంది. ఆల్రెడీ ‘వెంకీ మామ‘ సినిమాలో నాగచైతన్యకు జోడీగా ఎంపికైన ఆమె.. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాలో ఛాన్స్ పట్టేసినట్లు సమాచారం.
‘సింహా’ ‘లెజెండ్’ తర్వాత బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఒక కథానాయికగా కన్నడ అమ్మాయి శ్రద్ధ శ్రీనాథ్ ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు మరో కథానాయికగా రకుల్ ప్రీత్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి, బాలయ్య.. ఇద్దరితోనూ రకుల్ సినిమాలు చేసింది. బోయపాటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘సరైనోడు’లో ఆమే కథానాయిక అన్న సంగతి తెలిసిందే. దాని తర్వాత బోయపాటి తీసిన ‘జయజానకి నాయక’లోనూ ఆమె నటించింది.
ఇక బాలయ్యతో ఇటీవలే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’లో ప్రత్యేక పాత్ర చేసింది. అందులో ఆమె శ్రీదేవిగా కనిపించింది. ఆకు చాటు పిందె తడిసే పాటలో బాలయ్యతో కలిసి స్టెప్పులేసింది. ఇప్పుడు బాలయ్యతో ఫుల్ టైం హీరోయిన్ గా చేయబోతోంది. ఇప్పటిదాకా యువ కథానాయకులతోనే సినిమాలు చేస్తూ వచ్చిన రకుల్.. బాలయ్య లాంటి సీనియర్ హీరోతో నటించడం ఇదే తొలిసారి. తెలుగులో కెరీర్ డల్లయిన నేపథ్యంలో ఆమె కొంచెం రాజీ పడ్డట్లే కనిపిస్తోంది.