Begin typing your search above and press return to search.

ఫోటో టాక్‌: చినిగినా అంద‌మే చినిగితే టీనేజీ ల‌క్ష‌ణ‌మే!

By:  Tupaki Desk   |   29 Oct 2018 5:01 PM IST
ఫోటో టాక్‌: చినిగినా అంద‌మే చినిగితే టీనేజీ ల‌క్ష‌ణ‌మే!
X
ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్‌ ని అనుక‌రించ‌డంలో న‌వ‌త‌రం నాయిక‌లు ఎంతో స్పీడ్ మీదుంటారు. ఈ విష‌యంలో ర‌కుల్ ఇంకాస్త అడ్వాన్స్‌ డ్‌ గానే ఉంద‌ని ఈ ఫోటో చూస్తే అర్థ‌మ‌వుతోంది. డెనిమ్ ఫ్యాంటుకి ప్యాచీలు పెడితే అదో స్టైల్‌.. తారు రోడ్డుమీద అర‌గ‌దీసి ఇదో గొప్ప ఫ్యాష‌న్ అంటే ఆహా అంటూ క‌ళ్ల‌క‌ద్దుకున్నారు. ఈ ఫ్యాష‌న్ పోక‌డ‌లో ఇంకా ఇంకా వింత‌లెన్నో పుట్టుకొచ్చాయి. కెల్విన్ క్లెయిన్ అండ‌ర్ వేర్ డెనిమ్ జీన్సులోంచి బ‌య‌టికి క‌పిపిస్తే అది ఇంకో ర‌కం పిచ్చి ప్యాష‌న్. ఆ త‌రహా డ్రెస్సింగ్ స్టైల్‌ ని స్టార్ల నుంచి అడాప్ట్ చేసుకుంటోంది యువ‌త‌.

తాజాగా పిచ్చి వాళ్ల‌కే మ‌తిభ్రమించేలా మ‌రో అదిరిపోయే ట్రెండ్‌ ని ప‌రిచ‌యం చేసింది పంజాబి బ్యూటీ ర‌కుల్. అత్యంత ఖ‌రీదైన డెనిమ్ ష‌ర్ట్‌ లో క‌నిపించిన ఈ అమ్మ‌డు ఓ ట్విస్టును ఎలివేట్ చేసింది. ఆ ష‌ర్ట్ టాప్‌లో చిరిగి క‌నిపించ‌డం .. అదే ఓ ఫ్యాష‌న్‌గా ఎలివేట్ చేయ‌డం చూస్తుంటే ర‌కుల్‌ లో టీనేజీ కాలేజీ గాళ్ ల‌క్ష‌ణాలు ఇంకా పోలేద‌ని అర్థమ‌వుతోంది. కొంచెం అటూ ఇటూగా అదే మాట‌ను తాను కూడా అంది. మ‌న‌లోని బాల్యాన్ని అంత తేలిగ్గా మ‌ర్చిపోకూడదు అనే అర్థం వచ్చేలా క్యాప్ష‌న్‌ ని ఈ ఫోటోకి ఇచ్చింది.

ర‌కుల్ న‌టిస్తున్న ఎన్‌ జీకే త్వ‌ర‌లో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. కార్తీ స‌ర‌స‌న ఓ చిత్రంలో - శివ కార్తికేయ‌న్ స‌ర‌స‌న వేరొక చిత్రంలో న‌టిస్తోంది. అలానే విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో శ్రీ‌దేవిగా మైమ‌రిపించ‌బోతోంది. గ‌త నాలుగేళ్ల‌లో కెరీర్ ప‌రంగా పీక్స్ ని చూసిన ర‌కుల్ ఇప్పుడు కాస్త చ‌ల్ల‌బ‌డింది. తెలుగులో అగ్ర‌క‌థానాయ‌కులు ఛాన్సులివ్వ‌క‌పోవ‌డంతో ఈ గ్యాప్‌ ని ఫిల్ చేసేందుకు అటు బాలీవుడ్‌ పైనా దృష్టి సారిస్తోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌ లో దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తోంది