Begin typing your search above and press return to search.

'టేక్ ఏ బౌ' అంటూ సమంతపై స్టార్ హీరోయిన్ వైరల్ ట్వీట్..!

By:  Tupaki Desk   |   9 Jun 2021 5:00 AM IST
టేక్ ఏ బౌ అంటూ సమంతపై స్టార్ హీరోయిన్ వైరల్ ట్వీట్..!
X
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఇప్పుడు వెబ్ సిరీస్ ల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. మొన్నటివరకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత ఈ వెబ్ సిరీస్ తో ఓటిటి వరల్డ్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదటిసారి ఈ సూపర్ హిట్ వెబ్ సిరీస్ సీక్వెల్ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అరంగేట్రం చేసింది. 2019లో విడుదలై సక్సెస్ అయినటువంటి 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ ఇటీవలే మొదలైంది. సమంత వెబ్ సిరీస్ చేస్తుందని తెలియగానే దక్షిణాది ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజిలో పెరిగిపోయాయి.

ఇదివరకు కేవలం నార్త్ ప్రేక్షకుల వరకే ఆకట్టుకున్న ఫ్యామిలీ మ్యాన్ ఈసారి దక్షిణ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. అయితే తాజాగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ చూసిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ఫ్యామిలీ మ్యాన్ కాస్ట్ అండ్ క్రూ పై స్పెషల్ ట్వీట్ తో శుభాకాంక్షలు తెలిపింది. అలాగే మెయిన్ యాక్టర్స్ పై ప్రశంసలు కురిపించింది. రకుల్ ట్వీట్ చేస్తూ.. "ఇటీవలే 'ఫ్యామిలీ మ్యాన్ 2' చూసాను. ఇందులో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. మెయిన్ క్యారెక్టర్ మనోజ్ బాజపేయ్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవట్లేదు.

ఇంకా రాజీ పాత్రలో సమంత.. టేక్ ఏ బౌ.. మీరే ఇందులో ఫైర్ గర్ల్. రాజీ క్యారెక్టర్ లో అదరగొట్టారు. అలాగే దర్శకులు రాజ్ అండ్ డీకే లకు స్పెషల్ థాంక్స్. ఇప్పుడు నాతో పాటు మా ఫ్యామిలీ కూడా మీకు అభిమానులు అయిపోయారు." అంటూ తెలిపింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో సమంత పూర్తి డి-గ్లామరస్ రోల్ చేసింది. అలాగే చిన్నప్పటి నుండి ఎన్నో హింసలకు గురై ఒక్కసారిగా క్రూరంగా మారినటువంటి రాజీ క్యారెక్టర్ లో సామ్ నటించింది. హింసకు గురైనటువంటి ఓ అమ్మాయిని ఈ సమాజం పట్టించుకోకపోతే ఆ అమ్మాయి ఎంత క్రూరంగా మారుతుందో ఇందులో చూపించారు. స్టంట్ డైరెక్టర్ యానిక్ బేన్ సమంతతో ఊహించని రేంజిలో విన్యాసాలు చేయించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సామ్.. కాతువకుల రెండు కాదల్ - శాకుంతలం సినిమాలు చేస్తోంది.