Begin typing your search above and press return to search.

ఆర్‌ ఆర్‌ ఆర్‌ : సోపేయ్యడం ఆపేయ్‌ రకుల్‌

By:  Tupaki Desk   |   20 Nov 2018 12:45 PM IST
ఆర్‌ ఆర్‌ ఆర్‌ : సోపేయ్యడం ఆపేయ్‌ రకుల్‌
X
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి సోషల్‌ మీడియాలో టార్గెట్‌ అయ్యింది. గతంలో పలు సార్లు రకుల్‌ చేసిన వ్యాఖ్యల వల్ల, పోస్ట్‌ చేసిన ఫొటోల వల్ల విమర్శలు ఎదుర్కొన్న విషయం తెల్సిందే. రకుల్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. తనపై ఎన్ని విధాలుగా విమర్శలు వచ్చినా కూడా సోషల్‌ మీడియాలో ఎప్పటిలాగే యాక్టివ్‌ గా ఉంటూ వస్తోంది. తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మూవీ ప్రారంభం సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్ట్‌ పెట్టింది.

ఆ పోస్ట్‌ పై పెద్ద ఎత్తున కామెంట్స్‌ వస్తున్నాయి. టాలీవుడ్‌ లో ఈమద్య సరైన ఆఫర్లు లేని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెల్లగా జక్కన్నను మెప్పించే ప్రయత్నం చేస్తుందా, జక్కన్న దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేస్తుందా అంటూ టాక్‌ వినిపస్తుంది. ఆమె చేసిన పోస్ట్‌ కు పలువురు నువ్వు ఎంత గోకినా, గీకినా కూడా జక్కన్న నిన్ను మల్టీస్టారర్‌ మూవీలో తీసుకోడు. కనీసం చిన్న పాత్రకు అయినా రాజమౌళి నిన్ను కన్సిడర్‌ చేసే పరిస్థితి లేదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

రాజమౌళి పలువురు హీరోయిన్స్‌ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి. కాని రకుల్‌ పేరు అందులో లేదు. కనుక ఆర్‌ మల్టీస్టారర్‌ లో రకుల్‌ ఉండే ఛాన్స్‌ లేదు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. జస్ట్‌ కో ఆర్టిస్టులు అనే ఉద్దేశ్యంతో ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి ఉంటుంది. ఆ విషయాన్ని మరీ ఎందుకు ఇంతలా రాద్దాంతం చేస్తున్నారు అంటూ రకుల్‌ అభిమానులు కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.