Begin typing your search above and press return to search.

రకుల్ కు లక్కు కలిసొచ్చింది

By:  Tupaki Desk   |   20 July 2017 1:42 PM IST
రకుల్ కు లక్కు కలిసొచ్చింది
X
తెలుగులో తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ లీగ్ లో చేరిపోయింది నార్త్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. వరస హిట్లు ఆమె ఖాతాలో పడుతుండటంతో క్రేజీ ఆఫర్లు సైతం వరసగా వచ్చిపెడుతున్నాయి. ఈ ఏడాది రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో ఆల్రెడీ ఈ ఏడాది హిట బోణీ కొట్టింది. తాజాగా మురుగదాస్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా వస్తున్న స్పైడర్ ఎండింగ్ దశలో ఉంది. తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తర్వాత తనకు మరింత పేరొస్తుందని రకుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఇప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం తన టాలెంట్ చూపించాలని రకుల్ అనుకుంటోంది. ప్రస్తుతం సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా హిందీలో అయ్యారీ సినిమాలో నటిస్తోంది. ఇదే సమయంలో తమిళంలోనూ పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఒకటి రెండు సినిమాలు చేసినా అంత గుర్తింపేం రాలేదు. తాజాగా రకుల్ కు ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. తమిళ అగ్ర హీరో ఇళయదళపతి విజయ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ గా రకుల్ కు ఆఫర్ వచ్చిందనేది కోలివుడ్ టాక్. ప్రస్తుతం రకుల్ హీరోయిన్ నటిస్తున్న స్పైడర్ సినిమా దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.

ఇంతవరకు విజయ్ తో మురుగదాస్ తుపాకి కత్తి సినిమాలు తీశాడు. ఈ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. కత్తి సినిమాను చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా వస్తున్న మూడో సినిమా సన్ పిక్చర్స్ నిర్మించనుంది. అక్టోబర్ నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా గానీ రకుల్ కు ఓకే అయితే అదృష్టం ఆమెను వరించినట్టే. ఇక తమిళంలోనూ ఆమెకు ఛాన్సులు క్యూ కట్టడం ఖాయం.