Begin typing your search above and press return to search.

ఆ ముగ్గురునీ గాల్లో తిప్పిన రకుల్

By:  Tupaki Desk   |   8 May 2018 10:20 PM IST
ఆ ముగ్గురునీ గాల్లో తిప్పిన రకుల్
X
సౌత్ స్టార్ హీరోయిన్ గా ఇప్పుడిపుడే బిజీ అవుతోన్న రకుల్ అభిమానులకు దగ్గర ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఎలాంటి వేడుకలు జరిగినా కూడా అమ్మడు అభిమానులను కలుసుకోకుండా ఉండలేదు. ప్రతి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ ఉండేలా చేసుకోవడం రకుల్ బాగా అలవాటూ చేసుకుంటోంది. ఇకపోతే ఎవరు చేయని విధంగా తన అభిమానులతో లాంగ్ రైడ్ వెళ్ళడానికి కూడా రకుల్ సిద్ధమైంది.

ఇటీవల ముంబై లో హెలికాప్టర్ రైడ్ చేసిన ఈ బ్యూటీ తనలో ఉన్న ఒక మంచి ఆలోచనను బయటపెట్టింది. తన పర్సనల్ యాప్ ద్వారా కాంటెస్ట్ నిర్వహించి అందులో బెస్ట్ గా నిలిచిన ముగ్గురితో హెలికాప్టర్ రైడ్ ప్లాన్ చేసింది. హైదరాబాద్ నుంచి ముంబై వరకు ఓ ముగ్గురు అభిమానులను తీసుకెళ్ళి.. మొన్ననే వారిని పదిహేను నిమిషాలు పాటు గాల్లో తిప్పేసింది కూడాను. నన్ను ఎంతగానో అభిమానిస్తున్న ఫ్యాన్స్ కోసం 15 నిమిషాలైనా కేటాయించక పోతే ఎలా అని అంటోంది అమ్మడు.

ఇంకా ముందు ముందు అనేక రకాల ఐడియాలతో అభిమానులకు దగ్గరవుతాను అంటూ.. భవిష్యత్తులో అనేక ఊళ్ళలో ఫ్యాన్స్ తో రైడ్ కి వెళతాను అని వివరించింది, దీంతో రకుల్ ఫ్యాన్స్ ఆమె చేసిన ఆఫర్ ల్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి ఆమెతో తరువాత వెళ్లే లక్కీ పర్సన్స్ ఎవరో చూడాలి. ప్రస్తుతం తమిళ్ మరియు బాలీవుడ్ సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉంది. తెలుగులో మాత్రం సినిమాల్లేవ్. ప్చ్!!