Begin typing your search above and press return to search.

నా గది నుండి బయటకు రావట్లేదు

By:  Tupaki Desk   |   27 Dec 2020 3:30 PM IST
నా గది నుండి బయటకు రావట్లేదు
X
ఇటీవలే టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే. లక్షణాలు తీవ్రంగా లేకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకుంటుందట. కరోనాతో బాధపడుతున్నా కూడా రకుల్‌ ప్రీత్‌ సింగ్ అభిమానులతో చిట్ చాట్‌ చేసింది. తాజాగా ఒక లైవ్ లో ఆమె అభిమానులతో ముచ్చటించారు. ఈ సమయంలో మీరు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించగా... నేను గతకొన్ని రోజులుగా కనీసం గది నుండి కూడా బయటకు రావడం లేదు. నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ వ్యాయామం చేస్తున్నాను.

కరోనాను జయించేందుకు వ్యాయామం మరియు ఎక్సర్‌ సైజ్ లను చేస్తున్నాను. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటాను అనే నమ్మకం ఉంది. పౌష్టిక ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అందుకే ఈ సమయంలో కాస్త ఎక్కువగా పౌష్టిక ఆహారం తీసుకుని ఇమ్యూనిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పింది.

ఇదే సమయంలో తన బాడీ పెరగకుండా ఆమె రెగ్యులర్‌ గా వ్యాయామాలు చేస్తూనే ఉందట. ఆమద్య తమన్నా కరోనా బారిన పడటంతో కాస్త బరువు పెరిగింది. కాని ముందు జాగ్రత్తగా రకుల్ వర్కౌట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈమె సినిమాల విషయానికి వస్తే నితిన్ తో ఒక సినిమాను క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోంది.