Begin typing your search above and press return to search.

మహేష్ మూవీలో ఆమె డాక్టర్ అంటగా

By:  Tupaki Desk   |   11 March 2017 11:35 AM IST
మహేష్ మూవీలో ఆమె డాక్టర్ అంటగా
X
మహేష్ బాబు- మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో.. తెలుగు తమిళ భాషల్లో సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేసుకుంటోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇప్పుడీమె పాత్రకు సంబంధించిన ఈ ప్రధానమైన అప్డేట్ తెలియవచ్చింది.

సహజంగా మురుగదాస్ సినిమాల్లో హీరోయిన్ కి అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. సినిమా స్టోరీకి సంబంధం లేకుండా.. వేరే సెపరేట్ ట్రాక్ ఉంటుంది. మురుగ సినిమాల్లో హీరోయిన్లు పాటలకే అంకితం అన్నట్లుగా ఉంటారు. కానీ.. మహేష్ మూవీలో మాత్రం అలా కాదని తెలుస్తోంది. ఈ చిన్నదాని రోల్.. సినిమా కథలో భాగంగానే ఉంటుందట. రకుల్ ఓ డాక్టర్ పాత్ర పోషిస్తుండగా.. ఈ రోల్ కి చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. మహేష్ ఈ మూవీలో ఇన్విస్టిగేటర్ పాత్ర పోషిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ రోల్ కూడా ప్రామిసింగ్ గా ఉంటుందని అంటున్నారు.

తెలుగు.. తమిళ భాషల్లో బైలింగ్యువల్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి.. త్వరలో టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఎస్ తో ఈ టైటిల్ మొదలుకానుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ ని రివీల్ చేసి.. దానితో పాటే టైటిల్ ను కూడా అనౌన్స్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు యూనిట్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/