Begin typing your search above and press return to search.
అలాంటి కుర్రాడే తగల్లేదని తేల్చేసింది!
By: Tupaki Desk | 3 Nov 2019 10:32 AM ISTఫ్లర్ట్ అంటే ఏమిటి? ఒకరిని ఆకర్షించడం ఏడిపించడం అని చెప్పొచ్చేమో. ఇంకో రకంగా సులువుగా నమ్మించి ఏడిపించడం లాంటిది. నువ్వు అంటే నాకు ఇష్టం అని కళ్లతోనే కవ్వించడం అని కూడా చెప్పొచ్చు. ఇలాంటిది ఫ్రెండ్స్ మధ్య అప్పుడప్పుడు చూస్తుంటాం. పరిచయం లేని అమ్మాయి అబ్బాయి మధ్య ఇలాంటి గమ్మత్తయిన ఫ్లర్ట్ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని నమ్మించడం. లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాని నమ్మించేయడం.. చివరికి ఏడిపించడం అని చెప్పొచ్చు.
ఈ సంగతులన్నీ చెప్పింది ఎవరో? అంటే.. ఇంకెవరు మన్మధుడి గాళ్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ బ్యూటీ చూసేందుకు సాఫ్ట్ గా కనిపిస్తుంది కానీ పక్కా హార్డ్ హిట్టర్. ఫ్రెండ్స్ తో కలిస్తే చేసే సందడి మామూలుగా ఉండదు. తనలోని ఫ్లర్ట్ చేసే గుణం గురించి రకుల్ చాలా గమ్మత్తయిన విషయాలు చెప్పింది. ఇక ఫ్లర్ట్ చేసే విద్యలో తనకు గురువు ఎవరు? అంటే .. ఇంకెవరు తన స్నేహితురాలు రియా చక్రవర్తినే అట. తను గొప్ప ఎక్స్ పర్ట్ అని కూడా కితాబిచ్చేసింది. తన నుంచి వీలున్నప్పుడల్లా టిప్స్ తీసుకుంటానని చెప్పింది.
ఒక అబ్బాయిలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? అన్నది కూడా రకుల్ చెప్పింది. ఎవరైనా అబ్బాయి నాకు నచ్చాలంటే తెలివైన వాడు అయ్యి ఉండాలి. నాతో సంభాషణ చేసేప్పుడు ఆసక్తిని పెంచేదిగా ఉండాలి. అది ఇద్దరి ఫీలింగ్స్ కి దగ్గరై ఉండాలి. అలా లేకపోతే 2-3 రోజులు లేదా రెండు వారాలు లేదా రెండు మూడు నెలల్లోనే వీగిపోతుంది ఆ బంధం. అతడితో మ్యాచ్ అవ్వలేం.. అని పక్కా క్లారిటీనిచ్చింది రకుల్. ఇప్పటివరకూ అలాంటి కుర్రాడే తగల్లేదని తేల్చేసింది. అవతలి వారిని చదవడంలోనూ నేను చాలా బ్యాడ్ అని తన గురించి కఠోర నిజాన్ని లీక్ చేసేసింది. ఎవరితో అయినా మాట్లాడేప్పుడు అవతలివారిని ఎలా ఫ్లర్ట్ చేయాలో తెలీదు అని కూడా చెప్పింది. అదంతా సరే కానీ ఇలా నీలిరంగు స్కర్టులో అవతలివారిని ఫర్ట్ చేయడం ఎంతవరకూ సబబు? అంటూ బోయ్స్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.