Begin typing your search above and press return to search.
దేశభక్తిలో ప్రమోషన్సా రకుల్?
By: Tupaki Desk | 26 Jan 2018 10:50 PM ISTటాలీవుడ్ లో అడుగుపెట్టిన కొద్దీ కాలానికే టాప్ స్టార్ గా ఎదిగిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు తన కెరీర్లో విజయాలను ఎంత చూసిందో అపజయాలను కూడా అంతే చూసింది. ఏ మాత్రం నిరాశ చెందకుండా అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో తన నటనతో మెప్పిస్తూ ముందుకు సాగుతోంది. రిజల్ట్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుందో. అయితే రకుల్ ఆలోచన అంతా ఇప్పుడు ఒక సినిమాపైనే ఉంది.
అమ్మడు బాలీవుడ్ లో చాలా రోజుల తరువాత ఒక అవకాశం అందుకుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన అయారి సినిమాలో రకుల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా రకుల్ తన ప్రతి అడుగులో సినిమా ప్రమోషన్స్ ఉండేలా చూసుకుంటోంది. ఇక రిపబ్లిక్ డే సందర్బంగా దేశం మీద ప్రేమతో.. అలాగే సినిమాపై ప్రేమతో.. వాగా బోర్డర్ కు వెల్ళింది. రకుల్ ఆర్మీ మ్యాన్ కూతురు అని అందరికి తెలిసిందే. అయితే ఒక పక్క ఆ హోదాతో రకుల్ వాగా బోర్డర్లో కనిపించి అయ్యారి సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది.
ఆ దేశభక్తి సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకే రియల్ దేశభక్తి వేడుకల్లో సినిమాను కాస్త టచ్ చేస్తే సినిమా అందరికి చేరువవుతుందని అలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఒక వీడియోను కూడా రకుల్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. మరి రకుల్ కష్టానికి తగిన ఫలితం ఏ స్థాయిలో అందుతుందో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఫిబ్రవరి 9న ఆ సినిమా రిలీజ్ కానుంది.