Begin typing your search above and press return to search.
రకుల్ కు కోటి ఇస్తున్నారా?
By: Tupaki Desk | 11 Oct 2018 11:02 AM ISTటాలీవుడ్లో చిన్న సినిమాలతో ప్రస్థానం మొదలుపెట్టి.. ఉన్నట్లుండి పెద్ద రేంజికి వెళ్లిపోయిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. ఒక టైంలో ఆమెకు ఎదురే లేకపోయింది. వరుసగా జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసింది. ఆమె పారితోషకం కూడా చూస్తుండగానే పెరిగిపోయింది. మిగతా స్టార్ హీరోయిన్లను వెనక్కి నెట్టి నంబర్ వన్ అయ్యేలా కనిపించిందామె. కానీ ఎంత వేగంగా పైకి లేచిందో అంతే వేగంగా కింద పడింది రకుల్. ‘స్పైడర్’ సహా కొన్ని సినిమాలు ఫ్లాపవడంతో ఆమె క్రేజ్ పడిపోయింది. ఒక దశలో ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి. ఏడాదిగా రకుల్ ఊసే వినిపించట్లేదు ఎక్కడా. ఇలాంటి టైంలో ‘యన్.టి.ఆర్’ చిత్రంలో శ్రీదేవి పాత్రలో కనిపించే అరుదైన అవకాశం రకుల్ కు దక్కింది.
నిన్న రకుల్ పుట్టిన రోజు సందర్భంగా శ్రీదేవిగా ఆమెను జనాలకు పరిచయం చేశారు. ఐతే ఈ లుక్ జనాలకు అసలేమాత్రం రుచించలేదు. శ్రీదేవికి ఈమెకు పోలికేంటి అంటూ జనాలు తిట్టిపోశారు. నిన్నట్నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. అయితే చిత్ర బృందం మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. సినిమాలో రకుల్ ది క్యామియో రోల్ ఏమీ కాదట. ఆమె పాత్ర 20 నిమిషాల దాకా ఉంటుందట. ఎన్టీఆర్-శ్రీదేవి నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాల్లోని పాటలు.. సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమా తొలి భాగంతో పాటు రెండో భాగంలోనూ ఆమె కనిపిస్తుందని సమాచారం. ఎన్టీఆర్ రాజకీయ జీవితానికి బాటలు పరిచిన ‘బెబ్బులి పులి’లోని కొన్ని సీన్లు రెండో భాగంలో ఉంటాయట. అందులోనూ రకుల్ కనిపిస్తుందట. ఈ చిత్రం కోసం ఆమెకు కోటి రూపాయల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సినిమాలో శ్రీదేవిగా నటించే అవకాశంతో ఇంత మంచి పే చెక్ కూడా రావడం రకుల్ అదృష్టమే.