Begin typing your search above and press return to search.

చరణ్‌ కే నో చెప్పేంత బిజీనా?

By:  Tupaki Desk   |   26 Oct 2018 4:44 AM GMT
చరణ్‌ కే నో చెప్పేంత బిజీనా?
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. చకచక చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారనే విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇక బోయపాటి సినిమా అంటే ఐటెం సాంగ్‌ ఉండాల్సిందే. మాస్‌ ఆడియన్స్‌ ను ఉర్రూతలూగించేలా ఒక ఐటెం సాంగ్స్‌ ను ఈ చిత్రం కోసం బోయపాటి మరియు దేవిశ్రీలు ప్లాన్‌ చేస్తున్నాట. ఈ ఐటెం సాంగ్‌ ను స్టార్‌ హీరోయిన్‌ తో చేయాలని బోయాపాటి భావించాడట.

మొదట ఈ ఐటెం సాంగ్‌ కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను బోయపాటి సంప్రదించాడని సమాచారం అందుతుంది. తెలుగులో ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఐటెం సాంగ్‌ నేను చేయలేను అంటూ తేల్చి చెప్పిందట. తెలుగులో ఈమెకు ఛాన్స్‌ లు లేకున్నా తమిళంలో ఒక మోస్తరుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. అయితే మరీ ఐటెం సాంగ్‌ కు డేట్లు కేటాయించలేనంత బిజీగా అయితే రకుల్‌ లేదని సినీ వర్గాల వారు అంటున్నారు. ఐటెం సాంగ్‌ చేయడం ఇష్టం లేకే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బిజీ అంటూ నో చెప్పిందనే టాక్‌ వినిపిస్తుంది.

రకుల్‌ నో చెప్పడంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ తో బోయపాటి అండ్‌ టీం చర్చలు జరుపుతున్నారు. ఒక వైపు బాలీవుడ్‌ - టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఐటెం సాంగ్స్‌ తో రెచ్చి పోతున్న ఈ సమయంలో పెద్దగా అవకాశాలు లేని రకుల్‌ ఎందుకు మెగా మూవీ ఐటెం సాంగ్‌ కు నో చెప్పిందో అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రకుల్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఐటెం సాంగ్‌ చేస్తేనే బాగుండేది అంటూ ఆమె అభిమానులు కూడా అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చరణ్‌ తో రెండు సినిమాల్లో హీరోయిన్‌ గా నటించి ఐటెం సాంగ్‌ చేసేందుకు రకుల్‌ కు మనసొప్పలేదేమో అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి చరణ్‌ మూవీకి నో చెప్పి రకుల్‌ చర్చకు తెర లేపింది.