Begin typing your search above and press return to search.

ఆ పాత్రలు కూడా చెయ్యాలి!!

By:  Tupaki Desk   |   15 Sept 2017 11:00 PM IST
ఆ పాత్రలు కూడా చెయ్యాలి!!
X
ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ వారి గ్లామర్ ని బట్టి ఒకే తరహా పాత్రలను చేయడానికి సిద్ధపడతారు. కెరీర్ మంచి సక్సెస్ ట్రాక్ లో ఉండగా అనవసరంగా రిస్క్ ఎందుకని కొందరు భయపడితే.. మరికొందరు డి గ్లామర్ పాత్రలు చేయడం అవసరమా అని ప్రయోగాలకు దూరంగా ఉంటారు. అయితే కొంత మంది స్టార్ హీరోయిన్స్ సినిమా కంటెంట్ ని బట్టి పాత్రకు అవసరమయ్యే విధంగా మారతారు. అలాగే వినూత్న పాత్రలను చేయాలని కూడా కొందరికి ఆశ ఉంటుంది.

అదే తరహాలో ప్రస్తుతం సౌత్ స్టార్ హోరోయిన్స్ లో ఒకరైన రకుల్ ప్రీత్ కథ డిమాండ్ చేస్తే ఎటువంటి పాత్ర అయినా చేస్తాను అంటోంది. అందుకోసం గ్లామర్ ని కూడా లెక్క చేసేది లేదు అంటోంది. ఇంకా ఏం చెప్పిందంటే.. స్టార్ హీరోయిన్స్ అయినా సరే ఎవరైనా సరే కొత్త కథలు వస్తే పాత్రకు తగ్గటుగా చెయ్యాలి. అప్పుడే కొత్త కథలు పుట్టుకొస్తాయి. అదే విధంగా చేసే పాత్రను మాత్రమే చూడాలి అంతే గాని స్టార్ నటీనటులు ఉన్నారా లేదా అనే విషయాన్ని మర్చిపోవాలి అని రకుల్ చెబుతోంది. అంతే కాకుండా బాలీవుడ్‌లో విద్యాబాలన్‌ - దీపికా పదుకొణె - ఆలియా భట్‌ లను చూడండి. ఎవరు ఊహించని విధంగా ప్రతీసారీ వినూత్న కథలతో దర్శనమిస్తారు అంటూ వారి గురించి చెప్పుకొచ్చింది.

రకుల్ ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావించింది అంటే అమ్మడు ఇప్పుడు రెండు సినిమాల్లో ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలను చేస్తోంది. స్పైడర్ సినిమాలో గ్లామర్ పాత్ర చేసిన అమ్మడు ఇప్పుడు తమిళ్ లో కార్తీ హీరోగా తెరకెక్కుతున్నసినిమాలో ఓ పేదింటి పిల్లగా కనిపించబోనుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో అలరించిన అమ్మడు మొదటి సారి ఒక ప్రయోగాత్మకమైన పాత్రల్లో కనిపిస్తోంది. దీంతో స్టార్ హీరోయిన్స్ ఒకే పాత్రలో చెయ్యాలని రూల్ ఏమి లేదని ఇక నుంచి తెలుగు హీరోయిన్స్ కూడా ఇలాంటి పాత్రలు చేస్తే మంచిదని చెప్పుకొచ్చింది.