Begin typing your search above and press return to search.

అదే లెగ్గు.. అదే రకుల్.. నో ఛేంజ్

By:  Tupaki Desk   |   8 Jan 2016 1:00 AM IST
అదే లెగ్గు.. అదే రకుల్.. నో ఛేంజ్
X
రకుల్ ప్రీత్ సింగ్ మాంచి జోరందుకుంది. ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో రిలీజ్ కు దగ్గర పడుతున్న కొద్దీ.. కొద్ది కొద్దిగా సౌండ్ పెంచుతోంది సొగసరి. పనిలో పనిగా సలహాలు కూడా ఇచ్చే పని పెట్టుకుంది.

తన కెరీర్ లో ఇప్పటివరకూ లేని బ్లాక్ బస్టర్ ని ఇచ్చే బాధ్యత ఎన్టీఆర్ పై వేసిన రకుల్.. పాత ఫ్లాపుల ప్రభావం తనపై లేదని చెప్పేందుకు ట్రై చేస్తోంది. సంక్రాంతి పండుగ సంబరాలకి సెట్ అవుతూ.. తనకు అందరూ తగిలించిన ఓ ట్యాగ్ ని తొలగించమని అడుగుతోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ - లౌక్యం సినిమాలు హిట్ అయినపుడు.. అందరూ రకుల్ ప్రీత్ ని గోల్డెన్ లెగ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఆ తర్వాత వచ్చిన కిక్ 2 - బ్రూస్ లీ డిజాస్టర్ లుగా మిగలడంతో.. వెంటనే గోల్డెన్ లెగ్ ని కాస్తా ఐరన్ లెగ్ చేసేశారు. ఇప్పుడీ ఐరన్ లెగ్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ పైనా పడుతుందా అని కామెంట్ చేస్తున్నారు.

అందుకే రకుల్ ఫీలయ్యింది. 'నేను ఎప్పుడూ అదే మాంసం, రక్తం ఉన్న కాలు గల రకుల్ నే. ఇనుము లేదు, బంగారం లేదు'. నాకిలాంటివేం తగిలించద్దంటూ ఓ రిక్వెస్ట్ పంపింది అందరికీ. తనపై వచ్చే ఇలాంటి విమర్శలకు.. నాన్నకు ప్రేమతో చిత్రం సూపర్ సక్సెస్ తో సమాధానం చెప్పాలని ఆశలు పెట్టుకుంది ఈ భామ. అన్నట్లు.. నాన్నకు ప్రేమతో బ్లాక్ బస్టర్ అయితే.. అందులో తన భాగం పెరగడం కోసం సొంతంగా డబ్బింగ్ వెర్షన్ కూడా చెప్పేసింది. చూద్దాం.. స్టార్ స్టేటస్ అందుకునేందుకు రకుల్ చేస్తున్న ఈ మూడో ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో. !