Begin typing your search above and press return to search.

ఈసారి రకుల్ సైడ్ అయిపోయింది

By:  Tupaki Desk   |   13 Jan 2016 1:00 AM IST
ఈసారి రకుల్ సైడ్ అయిపోయింది
X
సాధారణంగా సినిమా రిలీజ్ ల విషయంలో, ముఖ్యంగా విడుదల సమయంలో హీరోయిన్ల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కుర్ర హీరోయిన్ అయినా స్టార్ రేంజ్ ఎదిగేందుకు తెగ తాపత్రాయపడుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన బ్రూస్ లీ విడుదల సమయంలో అయితే.. హీరోతో సమానంగా హంగామా చేసింది. ఎక్కడ చూసిన గ్లామర్ ప్రదర్శనలతో పిచ్చెక్కించేసేది. ఆడియో ఫంక్షన్ నుంచి, టీవీలు, ఇంటర్వ్యూలు.. ఇలా ఎక్కడ చూసినా రకుల్ హడావిడి బాగానే ఉంది. కానీ ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమతో విషయానికొచ్చే సరికి రకుల్ బాగా సైడ్ అయిపోయింది. ఓ రెండ ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొనిందంతే. ఒక్క సినిమా గ్యాప్ తో రకుల్ ఇంతగా మారిపోవడమేంటి అనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రకుల్ కి గ్లామర్ డాల్ గా మాంచి గుర్తింపు ఉంది. కానీ నాన్నకు ప్రేమతో సినిమాలో బాగా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ. హీరోయిన్ ని ప్రచారానికి ఎక్కువగా ఉపయోగించుకుంటే.. గ్లామర్ పై అంచనాలు పెరిగిపోతాయి. మరి ఇదేమో సుకుమార్ సినిమా. అందాల ప్రదర్శనలపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. ఇదో కారణమైతే.. రకుల్ ఇప్పుడు చాలా బిజీగా ఉండడంతోనే ఈవెంట్స్ కు పెద్దగా హాజరు కాలేకపోతోందని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ సరసన సరైనోడు చిత్రం కోసం డేట్స్ ఇచ్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికి వాళ్లు చేశారు, ఈమెకి కుదరలేదో కానీ.. నాన్నకు ప్రేమతో ప్రమోషన్స్ లో మాత్రం రకుల్ బాగా సైడ్ అయిపోయింది.