Begin typing your search above and press return to search.

సొంతింటి సీక్రెట్ విప్పేసిన రకుల్

By:  Tupaki Desk   |   19 April 2016 11:30 AM GMT
సొంతింటి సీక్రెట్ విప్పేసిన రకుల్
X
టాలీవుడ్ కుర్ర బ్యూటీ ర‌కుల్ ప్రీత్‌ సింగ్ రీసెంట్ గా హైద‌రాబాద్‌ లో ఓ ఇల్లు కొనింది. కోటి రూపాయ‌లకు పైగా ఖరీదు చేసే ఆ ఇంటిపై.. చాలానే రూమర్లు వచ్చాయి. ఈ ఇంటిని ఓ కుర్ర హీరో రకుల్ కి గిఫ్ట్ ఇచ్చాడనే టాక్ బాగా ఎక్కువగా వినిపించింది. రకుల్ కోటి రూపాయల వాల్యూ చేసే గిఫ్ట్ ఇచ్చిన హీరో ఎవరబ్బా అని టాలీవుడ్ జనాలు బాగానే ఆరాలు తీశారు. ఇప్పుడీ ఇంటికి సంబంధించిన సీక్రెట్ ని రకుల్ విప్పేసింది.

'ఎవ‌రో కొనిస్తే నేనెందుకు తీసుకొంటా. 'నా ఇల్లు నేనే కొనుక్కొన్నా. చిన్న వయసు నుంచి క‌ష్టప‌డి సంపాదించ‌డం నాకు అల‌వాటు. అలా దాచుకుి కొనుక్కొన్న ఇల్లు నాది. అంతే కాదు.. మా నాన్న పేరు మీద బ్యాంక్ లోన్ కూడా తీసుకొన్నాను. మీరు చూస్తానంటే ఆ లోన్ పేప‌ర్లు కూడా చూపిస్తా'' అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. కుర్ర హీరోతో రకుల్ చనువుగా ఉండబట్టే.. ఈ గిఫ్ట్ అందిందనే రూమర్ రకుల్ ఇంటికి కూడా వెళ్లాయ‌ట‌. అయితే.. తమ అమ్మాయి గురించి తెలుసుకాబ‌ట్టి వాళ్లేం అన‌లేద‌ని చెబుతోంది రకుల్ ప్రీత్.

'నాకు డ‌బ్బు విలువ తెలుస‌ు. వృథాగా ఖ‌ర్చు చేయడం నాకు ఇష్టం. అందుకే.. ఇల్లు సంపాదించుకోగ‌లిగాన‌ు' అంటోంది ర‌కుల్‌. అయినా 'ఇల్లు కొనిపెట్టే బోయ్‌ ఫ్రెండ్ ఉంటే.. కోటి రూపాయ‌ల ఇల్లేంటీ... నాలుగైదు కోట్ల విలువ చేసే గిఫ్ట్ కొనిపించుకునేదాన్నిగా అంటూ నిలదీస్తోంది. అంతే కదా.. రకుల్ అడిగిన ప్రశ్నలోనూ పాయింట్ ఉంది మరి.