Begin typing your search above and press return to search.

విషం తాగిస్తోందంటూ ర‌కుల్ పై గ‌రంగరం!

By:  Tupaki Desk   |   13 Feb 2022 8:06 AM IST
విషం తాగిస్తోందంటూ ర‌కుల్ పై గ‌రంగరం!
X
బికినీల‌తో వేడెక్కించ‌డం .. స్విమ్ సూట్ల‌తో చెల‌రేగిపోవ‌డం.. నిరంత‌ర ఫ్యాష‌న్ అనుక‌ర‌ణతో యూత్ కి కిక్కెక్కించ‌డం.. ర‌కుల్ నిత్య వ్యాప‌కం. ఇటీవ‌లి కాలంలో ఈ బ్యూటీకి టాలీవుడ్ లో స‌రైన హిట్టు ద‌క్క‌డం లేదు. ఆ క్ర‌మంలోనే దీపం ఉండ‌గానే అటు బాలీవుడ్ కోలీవుడ్ లోనూ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. కానీ అక్క‌డా చుక్కెదుర‌వుతోంది. తెలుగు లో అగ్ర హీరోలెవ‌ర‌కూ ర‌కుల్ కి అవ‌కాశాలు ఇవ్వడం లేదు. మ‌న్మ‌ధుడు- కొండ‌పొలం లాంటి ఫ్లాప్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ కి పెద్ద హీరో సినిమా ఏదీ క‌నిపించ‌డం లేదు.

అదే క్ర‌మంలో ఈ బ్యూటీ రూట్ మార్చిన‌ట్టే క‌నిపిస్తోంది. కాంపిటీష‌న్ ని ఎదుర్కొనేందుకు నిరంత‌ర ఫోటోషూట్ల‌తో అభిమానుల‌కు ట‌చ్ లో ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటో వీడియో ట్రీట్ తో ఆక‌ర్షిస్తోంది. తాజాగా ప్ర‌ఖ్యాత ట్రావెల్ మ్యాగ‌జైన్ పీకాక్ క‌వ‌ర్ పేజీపై ర‌కుల్ ద‌ర్శ‌న‌మిచ్చింది. స్టీమీ లుక్ తో ర‌కుల్ హొయ‌లు యువ‌త‌రంలోకి దూసుకెళ్లింది. రకుల్ ప్రీత్ బికినీలో తన హాటెస్ట్ అవ‌తార్ ని ప్రదర్శించి బోయ్స్ గుండె చప్పుడును పెంచింది. అందాల పంజాబీ బ్యూటీ హాట్ నెస్ చూసి అభిమానులు `ఖచ్చితంగా ఇది విషం` అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ కి తన గ్లామర్ టెంపర్ ని తీసుకెళ్లిన నటిగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తోంది. తాజా ఫోటోషూట్ బంచ్ ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోగా వైర‌ల్ గా మారింది. నటికి సంబంధించిన ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో మంట‌లు పెడుతున్నాయి. రకుల్ ఈ బోల్డ్ లుక్ నుండి కళ్ళు తిప్పుకోవ‌డం అంత వీజీ కాదు. అలాగే ర‌కుల్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఫోటోషూట్ వీడియోను షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ లో రకుల్ సింగ్ ఆరెంజ్ కలర్ బికినీలో క‌నిపించింది. ఆరెంజ్ బికినీలో చాలా హాట్ గా తన పర్ఫెక్ట్ ఫిగర్ ని ప్రదర్శిస్తోంది. నాలుగు గంటల్లో రకుల్ హాట్ ఫోటో దాదాపు 3.8 మిలియన్ల మంది హృదయాలను గాయ‌ప‌రిచింది. ఈ ఫోటోపై వ్యాఖ్యానిస్తూ ఒక సోషల్ మీడియా వినియోగదారు ``ఇది చాలా విషం`` అని రాశారు. మరికొందరు తమ స్పందనలను హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేస్తున్నారు.

ఇది కాకుండా నటి రకుల్ ప్రీత్ సింగ్ చిత్రం వీడియోను కూడా ట్రావెల్ పీకాక్ మ్యాగజైన్ వారి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫోటోషూట్ సమయంలో ఈ వీడియో చిత్రీకరించారు. రకుల్ ప్రీత్ సింగ్ న్యూమంథ్ లో ట్రావెల్ పీకాక్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించనుంది. ట్రావెల్ పీకాక్ మ్యాగజైన్ తో తన చిరస్మరణీయ ప్రయాణాన్ని స్మ‌రించుకుంది ర‌కుల్. తనకు ఇష్ట‌మైన‌ ప్రత్యేక నగరాల గురించి ఈ క‌వ‌ర్ స్టోరీలో వెల్ల‌డిస్తుంది.

ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఇండియ‌న్ -2లో న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా అయినా వివాదాల వ‌ల్ల డిలే అవుతోంది.