Begin typing your search above and press return to search.

సూర్య లుక్కు కోసం రకుల్ ఆరాటం

By:  Tupaki Desk   |   27 Feb 2018 9:54 PM IST
సూర్య లుక్కు కోసం రకుల్ ఆరాటం
X
కోలీవుడ్ లో ఉండే వినూత్న దర్శకుల్లో సెల్వా రాఘవన్ ఒకరు. 7/g బృందావన కాలనీ - ఆడవారి మాటలకూ అర్దాలే వేరులో లాంటి డిఫెరెంట్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక యుగానికి ఒక్కడు లాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తీసి ఎలాంటి సినిమాలనైనా తీయగలను అని నిరూపించుకున్నాడు. ఆ సినిమా తమిళ్ లో కంటే తెలుగులోనే మంచి వసూళ్లను అందుకుంది.

ఇక అసలు విషయానికి వస్తే.. చాలా రోజుల తరువాత సెల్వ రాఘవన్ ఒక స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. సూర్య తో ఒక డిఫెరెంట్ సినిమాను తెరకెక్కించాలని గత ఏడాది నుంచి ఈ దర్శకుడు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఫైనల్ గా ఈ ఏడాది జనవరి లో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని ముందుగానే రిలీజ్ చేయాలనీ దర్శకుడు అనుకుంటున్నాడు. సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు పాజిటివ్ టాక్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడట. మార్చ్ 3న సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ రీసెంట్ గా చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యింది.

ఇకపోతే ఈ సినిమాలో సూర్య సరసన రకుల్ ప్రీత్ అలాగే సాయి పల్లవి హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న అయ్యారి సినిమాను తెగ పొగిడేసిన రకుల్.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి డీలా పడిపోయింది. అలాగే తెలుగులో సినిమాలు కూడా లేకపోవడంతో ఇంకా అప్సెట్ అయ్యింది. కాని ఇప్పుడు సూర్య సినిమా ఫస్ట్ లుక్ వస్తోందని చాలా ఎక్సయిటింగ్ గా సోషల్ మీడియాలో చెప్పుకుంటోంది రకుల్. ఆమె ఆరాటం చూస్తే ముచ్చటేస్తోంది అంతే మరి.