Begin typing your search above and press return to search.

రకుల్ ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరిందా?

By:  Tupaki Desk   |   1 Sept 2019 10:40 AM IST
రకుల్ ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరిందా?
X
సెలబ్రిటీలకు ఒక చిక్కు ఉంటుంది. వారు మాట్లాడే మాటలు సాదాసీదాగా ఉన్నా భూతద్దంలోంచి చూస్తారు. అలాంటిది కాస్త తేడాగా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? ఎంత గ్లామర్ ఒలకబోసినా విజయం మాత్రం చేతికి అందని వేళ.. క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ నోటి నుంచి వచ్చిన తాజా మాటలు కొత్త సందేహాలకు తావిచ్చేలా ఉందని చెప్పాలి. అమ్మడి మాటలు ఎవరికో పంచ్ వేసినట్లుగా ఉన్నాయన్నట్లుగా ఉండటం విశేషం.

కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అంటే హీరోయిన్ చుట్టూనే తిరగాలన్నది ఏమీ లేదనటమేకాదు.. అవార్డు సినిమాలకు ఇంకా సమయం ఉందని.. కమర్షియల్ సినిమాలకే తన ప్రాధాన్యత అని చెప్పటం గమనార్హం. గ్లామర్ ఒలకపోసే సినిమాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేయనని చెబుతున్న ఆమె.. సినిమా అంతా హీరోయిన్ చుట్టూ తిరగాలని ఏమీ లేదంటోంది.

ఇటీవల కాలంలో హీరోయిన్ చుట్టూ తిరిగే కొన్నిసినిమాలు సక్సెస్ కావటం.. ఆ చిత్రాల్లో నటించిన వారంతా సీనియర్లుగా.. తమలా యంగ్ కాదన్నట్లుగా రకుల్ వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. హీరోయిన్లు ఎవరైనా.. నటనకు ప్రాధాన్యం ఉండి.. లేడీ ఓరియంటెడ్ సినిమా వస్తే తప్పక చేస్తాననే మాటలకు భిన్నంగా.. తాను కమర్షియల్ సినిమాలకే పెద్దపీట వేస్తానని చెప్పారు

రకుల్ వ్యాఖ్యలు చూస్తే.. తనకు దక్కని సక్సెస్ ఎవరికో దక్కుతుందన్న దుగ్ధ రకుల్ మాటల్లో వినిపిస్తోందన్నట్లుగా ఉందని చెప్పాలి. మరి.. రకుల్ మాటలకు వచ్చే రియాక్షన్ ఆధారంగా.. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం మరెంతమంది స్పందించేలా చేస్తుందో చూడాలి.