Begin typing your search above and press return to search.

ఐటమ్ సాంగుకు నన్ను అడగలేదంటున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   15 Jan 2019 10:07 PM IST
ఐటమ్ సాంగుకు నన్ను అడగలేదంటున్న బ్యూటీ
X
రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదుగానీ తన ఫోకస్ అంతా తమిళ.. హిందీ భాషలపై పెట్టింది. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో కనిపించినా.. ఆ క్యామియో వల్ల రకుల్ కు కొత్తగా వచ్చిందేమీ లేదు. ఇది కాకుండా ఒక్క స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కూడా రకుల్ నటించడం లేదు.

ఇదిలా ఉంటే ఈ మధ్య రకుల్ కు సంబంధించిన ఒక వార్త హల్చల్ చేసింది. 'కేజీఎఫ్' లో రకుల్ కు ఐటెమ్ సాంగ్ చేసే అవకాశం వచ్చినా రిజెక్ట్ చేసిందని అన్నారు. రకుల్ నో చెప్తేనే ఆ ఐటెమ్ నెంబర్ మిల్కీ బ్యూటీ తమన్నాకు వెళ్ళిందట. తమన్నా మాత్రం నో చెప్పకుండా ఎస్ అని చెప్పేసింది. ఇదే విషయంపై అమ్మడిని ఆరా తీస్తే రకుల్ అదో రూమర్ అని కొట్టిపారేసింది. అంతటితో ఆగకుండా తనకు 'కేజీఎఫ్' లో ఐటెం సాంగ్ చేసే అవకాశం రాలేదని.. ఒకవేళ అవకాశం వస్తే ఎందుకు వద్దంటానని చెప్పుకొచ్చింది. అయినా ఐటమ్ సాంగ్స్ లో నటిస్తే తప్పేముందని ప్రశ్నించింది.

నిజమే.. ఈ తరం హీరోయిన్లలో చాలమంది ఐటమ్ సాంగ్స్ లో నటించేందుకు వెనకడుగు వేయడం లేదు. పైగా రెండు మూడు రోజుల కాల్ షీట్స్ తోనే భారీగా డబ్బు ముడుతుంటే ఎవరైనా ఎందుకు వద్దంటారు లెండి. పైగా సాంగ్ హిట్ అయితే అదోరకమైన క్రేజు.. డబ్బెవరికి చేదు.. క్రేజ్ ఎవరికి వద్దు?