Begin typing your search above and press return to search.

రకుల్ వేదాంతం అందుకేనా?

By:  Tupaki Desk   |   1 Nov 2017 11:00 PM IST
రకుల్ వేదాంతం అందుకేనా?
X
టాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కచ్చితంగా ఉంటుంది. మొదట్లో గ్లామర్ డోస్ లు.. లిప్ కిస్ లతో తెగ రెచ్చిపోయిన ఈ భామ.. కొన్ని నెలలుగా దాదాపు స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది. మరి ఈ స్థాయికి రావడంతో గ్లామర్ డోస్ విషయంలో కొన్ని పరిమితులు పెట్టుకోవడం.. ఆ వెంటనే అవకాశాలు నెమ్మదించడం జరిగిపోయాయి.

అయినా సరే తాను ఫుల్ బిజీనే అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. సహజంగా జనాలు అందరికీ 365 రోజులే ఏడాదికి ఉంటాయని.. తాను మాత్రం 500 రోజులు ఉన్నట్లుు భావిస్తానని చెబుతున్న రకుల్ ప్రీత్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నుంచి ఇప్పటివరకూ చిన్నపాటి బ్రేక్ కూడా తీసుకోకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. తనకు టైం సెన్స్ బాగా ఎక్కువ అంటున్న ఈ భామ.. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరగడంతో.. టైం విషయంలో తాను కచ్చితత్వం పాటిస్తానని చెబుతోంది. ఒక్క క్షణం కూడా వృథా చేయద్దని తల్లిదండ్రులు చెప్పిన మాటలే తనకు స్ఫూర్తి అనేస్తోంది కూడా.

స్కూల్ నుంచి వచ్చాక ప్రతీ రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉందట. సంగీతం.. భరతనాట్యం.. గోల్ఫ్.. యోగా.. హార్మోనియం.. ఇలా ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూనే ఉందట. ఒక్క రోజు పని లేకపోయినా తెగ బోర్ కొట్టేస్తుందని చెబుతున్న రకుల్.. పని లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతుందని అంటోంది. ఇంతకీ సినిమాలు తగ్గడమే ఇంతగా టైమ్ గురించి క్లాస్ పీకడానికి కారణమా రకుల్?