Begin typing your search above and press return to search.

రకుల్ మాట మీద నిలబడింది.. కానీ

By:  Tupaki Desk   |   10 April 2018 1:46 PM IST
రకుల్ మాట మీద నిలబడింది.. కానీ
X
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్యన క్యాస్టింగ్ కౌచ్ అంశంపై రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. అసలు ఇండస్ట్రీలో అలాంటి సంస్కృతిని తాను చూడలేదని.. ఫేస్ చేయలేదని చెప్పింది రకుల్. ఆమె కామెంట్స్ పై కొందరు తీవ్రంగానే విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ సాక్ష్యాధారాలు బైటపెడతామని బెదిరిస్తున్నారు కూడా.

అయితే.. రకుల్ ప్రీత్ మాత్రం తను అన్న మాటపై నిలబడుతోంది. వర్క్ ప్లేస్ విషయంలో టాలీవుడ్ అత్యంత భద్రమైన ప్లేస్ అంటున్న రకుల్ ప్రీత్.. అదే మాటను రిపీట్ చేస్తోంది. అయితే తనవరకు తనకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ కాలేదని మాత్రమే తాను అన్నానని చెబుతోంది. ఇంతవరకూ ఊహించిన విషయమే అయినా.. ఆ తర్వాతే రకుల్ చెప్పిన మాటలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఒక అమ్మాయిని లోబరచుకునేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం ఏంటని.. అంతకంటే సులభమైన మార్గాలు మరికొన్ని ఉంటాయి కదా అనేసింది రకుల్.

అలాగే ఈ ప్రపంచం మొత్తం అవకాశం ఉంటుందంటూ అమ్మాయిలకు హితబోధ కూడా చేసింది. ప్రపంచంలో అనేక రంగాల్లో ఇలాంటి అవకాశవాదం ఉన్నా.. సినిమా ఇండస్ట్రీ విషయంలోనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయని.. బహుశా అందుకు ఇక్కడ లభించే గ్లామర్ తో పాటు విపరీతమైన గుర్తింపు లభించడం కూడా కారణం కావచ్చని అభిప్రాయపడింది రకుల్ ప్రీత్ సింగ్.