Begin typing your search above and press return to search.
కొద్దిగా ఒళ్లు చేస్తే ఆ బ్యూటీ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే ఛాన్స్!
By: Tupaki Desk | 23 April 2020 3:50 PM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందంతో పాటు అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'కెరటం’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నుండి తన అందంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు - రవితేజ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - నాగచైతన్య - అల్లు అర్జున్ - రామ్ తదితర స్టార్ హీరోలతో నటించిన రకుల్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఎప్పుడూ సమయం మనకు అనుకూలంగా ఉందదు కదా.. ఈ మధ్య రకుల్ అవకాశాలు తగ్గాయని చెప్పవచ్చు. అయితే అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కాలం ఏదైనా పరిస్థితులు ఎలా ఉన్నా ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు ఇదే ఆమెకి అవకాశాలు తగ్గడానికి ఒక కారణమని అంటున్నారు.
ఎప్పుడు ఫిట్ నెస్ అంటూ మరీ టూ మచ్ గా ఫిట్ నెస్ ఫ్రీక్ అయిపోవడం వల్లే రకుల్ కి తెలుగులో ఆఫర్లు రావడం లేదట. వాస్తవానికి కెరీర్ స్టార్టింగ్ నుండి రకుల్ బాగానే ముద్దుగా ఉండేది. కానీ తర్వాత రోజుల్లో బక్కగా మారిపోయి పీలగా కనిపించింది. త్రివిక్రమ్ స్టైల్ లో చెప్పాలంటే కరువొచ్చిన కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిందని కామెంట్ చేసే అంతలా మారిపోయింది. దీంతో స్టార్ హీరోల పక్కన సెట్ కాదనే అభిప్రాయానికి వచ్చేసారు దర్శకనిర్మాతలు. అదే ఈ అమ్మడు ఒకప్పుడున్నట్లు ఉంటే స్టార్ హీరోలు మళ్లీ పిలిచి ఈ బ్యూటీకి ఆఫర్లు ఇస్తారని కొందరు సీనియర్ కాస్టింగ్ ఏజెంట్స్ అంటున్నారు. నిజానికి రకుల్ ప్రీత్ అలా మారిపోవడానికి బాలీవుడ్ లో పాగా వేయాలనే ఆలోచన కూడా ఒక కారణమే అంటున్నారు. అంతేకాకుండా ఈ బ్యూటీ 'మన్మథుడు 2'లో నటించడం రాంగ్ స్టెప్ అని.. అలానే ఆ సినిమాలో అమ్మాయికి లిప్ లాక్ ఇవ్వడంతో మాస్ ఆడియెన్స్ లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ ని చాలా వరకు నష్టపోయిందని అంటున్నారు.
ఈ ముద్దుగుమ్మ మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావలంటే కొద్దిగా ఒళ్లు చేసి కన్నడ తమిళ సీమల పై కాన్సంట్రేట్ చేస్తే బెటర్ అని వారు సూచిస్తున్నారట. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో ఈ బ్యూటీని అనుకోని మళ్లీ తీసేసారంటనే ఈ బ్యూటీపై మార్కెట్ వర్గాల్లో పెరిగిన నిరాశక్తిని అర్ధం చేసుకోవచ్చు. రకుల్ మళ్లీ ట్రాక్ ఎక్కడానికి ఎలాంటి కేర్ తీసుకోబోతుందో చూడాలి. ఇదిలా ఉండగా రకుల్ ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న 'ఎటాక్' సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా అజయ్ దేవ్‌గన్ సరసన రకుల్ నటించిన 'దేదే ప్యార్ దే'కి సీక్వెల్ గా రాబోయే సినిమాలో కూడా నటించే అవకాశముంది అంటున్నారు.