Begin typing your search above and press return to search.

అయ్యో.. రకుల్ చేతిలో పెద్దవి లేవే

By:  Tupaki Desk   |   1 May 2016 9:37 AM IST
అయ్యో.. రకుల్ చేతిలో పెద్దవి లేవే
X
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్ల క్రితం వరకు మహా క్రేజీ హీరోయిన్. టాప్ రేంజ్ హీరోలు అందరూ ఈ కుర్ర భామతో సినిమా చేసేందుకు తెగ ఉత్సాహం చూపించారు. ఒకప్పుడు రకుల్ చేతిలో ఉన్న సినిమాలన్నీ భారీ చిత్రాలే. అసలు చిన్న సినిమాల జోలికి ఈమె వెళ్లదేమో అనిపించేసింది. కానీ ఇప్పుడు టైం మారిపోయింది.

వరుసగా రకుల్ ప్రీత్ సింగ్ కి ఎదురుదెబ్బలు తగిలాయి. పెద్ద హీరోలతో ఈమె చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో.. డిమాండ్ తగ్గిపోయింది. మాస్ మహరాజ్ రవితేజతో కిక్2 - రామ్ చరణ్ తో బ్రూస్ లీ చిత్రాలు నిరుత్సాహపరచడంతో.. పెద్ద హీరోలు దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. అప్పటికే చేతిలో చేస్తున్న ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో - బన్నీ సరైనోడు తర్వాత.. కొత్తగా భారీ ఆఫర్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు రకుల్ కి.

రీసెంట్ గా అయితే రామ్ చరణ్ ధృవ ఒక్కటే కొత్తగా వచ్చిన భారీ ఆఫర్. ఇది కాకుండా సాయిధరంతేజ్ తో ఓ మూవీ, నితిన్ తో మరో సినిమా చేస్తున్నా.. ఇవి రెండూ మీడియం బడ్జెట్ చిత్రాలే. కానీ మరోసారి రకుల్ సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్సులున్నాయనే టాక్ వినిపిస్తోంది. సరైనోడు హిట్ తర్వాత.. చెర్రీ కూడా సక్సెస్ ఇస్తే.. రకుల్ కి మరోసారి ఆఫర్లు క్యూ కట్టడం ఖాయంగా భావించచ్చు.