Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మిల్కీ వైట్లో కూల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   10 Jan 2019 3:37 PM GMT
ఫోటో స్టొరీ: మిల్కీ వైట్లో కూల్ బ్యూటీ
X
రెండేళ్ళ క్రితం వరకూ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో మహా జోరుగా సినిమాలు చేస్తుండేది. కానీ 'స్పైడర్' తర్వాత మాత్రం ఒక్కటి కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చేయలేదు. శ్రీదేవి పాత్రలో నటించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' మినహాయిస్తే రకుల్ ఖాతాలో ఉన్నవన్నీ తమిళ.. హిందీ ప్రాజెక్టులే. కానీ రకుల్ నటించే తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అవుతాయి కాబట్టి తెలుగు ప్రేక్షకులకు ఆమె దూరమైనట్టుమాత్రం కాదు.

సినిమాలతో పాటుగా ఫోటో షూట్లు చేయడం.. మ్యాగజైన్ కవర్ పేజీలపై తళుక్కున మెరవడం ఈ అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా 'ఎగ్జిబిట్' అనే మ్యాగజైన్ కవర్ పేజిపై రకుల్ దర్శనమిచ్చింది. రకుల్ మొదటి నుంచి ఫిట్నెస్ ఫ్రీక్. దానికి తగ్గట్టే ఈ కవర్ పేజి ఫోటోలో స్లిమ్ముగా కనిపించింది. అల్ట్రా స్టైలిష్ గా ఉండే వైట్ కలర్ డిజైనర్ సూట్ ధరించి నిలబడింది. లూజ్ హెయిర్.. డ్రెస్ కు తగ్గ మేకప్ తో ఓ పర్ఫెక్ట్ మోడల్ టైపులో కాన్ఫిడెంట్ గా కనిపించింది. క్లీవేజ్ కనిపించీ కనిపించనట్టుగా సూట్ కు వీ నెక్ ఉండడంతో అందాల బొమ్మలా ఉంది.

కవర్ పేజి మీద 'హార్డ్ వైర్డ్ టు హిప్నటైజ్' అనే క్యాప్షన్ ఉంది. నిజమే.. జనాలను తన అందంతో మెస్మరైజ్ చేసి.. హిప్నటైజ్ చేసి బుట్టలో పడేసేందుకే పుట్టినట్టుగా ఉంది. ఈ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన రకుల్.. "హార్డ్ వైర్డ్ టు హిప్నటైజ్.. న్యూ ఇయర్ న్యూ లుక్. ఎగ్జిబిట్ మ్యాగజైన్ జనవరి ఎడిషన్ కాపీలను తీసుకోండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో సంగతి ఇలా ఉంటే.. కార్తి సినిమా 'దేవ్' ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.