Begin typing your search above and press return to search.

నా ఫోటోలు.. నా ఇష్టం నా ఫ్యామిలీ ఇష్టం

By:  Tupaki Desk   |   16 Feb 2018 11:37 AM IST
నా ఫోటోలు.. నా ఇష్టం నా ఫ్యామిలీ ఇష్టం
X
టాలీవుడ్ లో సినిమాలు అనగానే గ్లామర్ మాత్రమే అడుగుతున్నారు అంటూ క్లాసులు పీకేసి.. బాలీవుడ్ లో ఒక మ్యాగజైన్ కవర్ అనగానే ఏకంగా బికినీల్లో బ్రాలలో అండర్ వేరుల్లో కూడా ఫోజులు ఇచ్చేసిన రకుల్ ప్రీత్ సింగ్ పై ప్రశంసల కంటే కూడా క్రిటిసిజం ఎక్కువగా వినిపించింది. ఆమె తెలుగు సినిమాలను కాస్త చులకనగా చూడటం వలన.. వెంటనే ఇక్కడ నుండి చాలామంది పంచులు వేసేశారు. అవన్నీ రకుల్ చెవిన కూడా పడ్డాయ్.

అయితే వీటన్నింటిపై చాలా ఘాటుగా స్పందిస్తోంది రకుల్ ప్రీత్. అసలు నా ఫోటోషూట్లు నా ఇష్టం అంటూ సమాధానం చెప్పేసింది. ''చూడండి.. నాకు రాక రాక ఒక టాప్ మ్యాగజైన్ నుండి ఫోటో షూట్ చేసే ఆఫర్ వచ్చింది. అలాంటి ఆఫర్ ను ఏ హీరోయిన్ కూడా వద్దనుకోదు. అందుకే నేను వద్దునుకోలేదు. ఇక కామెంట్లు అంటారా.. కొంతమంది పొగుడుతారు.. కొంతమంది తిడతారు.. నేను దేనికీ ఉబ్బితబ్బిబ్బవనూ.. దేనికీ కుమిలిపోను. లైట్ తీస్కోండి. నాకు నచ్చింది ఆ ఫోటోషూట్. నా ఫ్యామిలీకి నచ్చింది. మేం ఇష్టపడ్డాక ఇంక ఎవరేమంటే ఏంటి?'' అంటూ ప్రశ్నించింది రకుల్.

అంతేలేండి.. ఫేం వచ్చేవరకు ఏం చేసిన అభిమానుల కోసం చేస్తున్నాను అనడం.. ఫేం వచ్చేశాక నా ఫోటోలు నా ఇష్టం అనడం హీరోయిన్లకు శరా మామూలే. కాకపోతే తాప్సీ అండ్ ఇలియానా తరహాలో ఇక్కడ స్టార్డమ్ వస్తున్న టైములో బట్టలు సర్దేసుకుంటే.. అది రకుల్ కే నష్టం. కాదంటారా? ఇకపోతే రకుల్ మ్యాగ్జిమ్ మ్యాగజైన్ ఫోటో షూట్ అంతా ఈరోజు రిలీజ్ అవుతున్న అయ్యారి సినిమాను ప్రమోట్ చేయడానికి ఆమె పడిన కష్టం. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.