Begin typing your search above and press return to search.

రకూల్‌ లిప్‌ లాక్‌ హాట్‌ హాట్ గురూ

By:  Tupaki Desk   |   21 Aug 2015 5:13 PM IST
రకూల్‌ లిప్‌ లాక్‌ హాట్‌ హాట్ గురూ
X
తెలుగు సినిమాల్లో లిప్‌ లాక్‌ లు అరుదుగా కనిపించేవే. కానీ ఇటీవలి కాలంలో నవతరం నాయికలు హద్దులు చెరిపేస్తున్నారు. పరిధిమీరి పెదవి ముద్దుకు రెడీ అయిపోతున్నారు. ఆ లిప్‌ లాక్‌ లేనిదే సినిమానే లేదు మ్యాడమ్‌.. అని దర్శకనిర్మాతలు బాగానే కన్విన్స్‌ చేసేస్తున్నారు.

కిక్‌ 2లో రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ మాస్‌ మహారాజ్‌ కి ఇచ్చిన లిప్‌ కిస్‌ చూశాక జనాలకు అసూయ పుట్టింది. అరే ఎంత ఘాటైన అదరచుంబనం. అదరగొట్టేసిందే. ఆ కిస్సు లోంచి వన్‌ డ్రాప్‌ అదరమధురం నాక్కూడా ఇస్తే బావుణ్ణే అని ఆడియెన్‌ ఫీలయ్యారంటే రకూల్‌ ఇచ్చిన ముద్దు ఎంత ఆగా వర్కవుటైందో అర్థం చేసుకోవచ్చు. మూడు వందల మంది ఊరి జనం ముందు రకూల్‌ అదరిపోయే ముద్దిచ్చేసింది. అఫ్‌ కోర్స్‌! కెమెరా మేన్‌, డైరెక్టర్‌ ఇతరత్రా యూనిట్‌ సభ్యుల ముందు రకూల్‌ ఈ రేంజులో ఎలా రెచ్చిపోగలిగిందో తనకే తెలియాలి.

ఆ ఒక్క ముద్దు కథకి చాలా కీలకం. భీకరమైన విలన్‌ ని ఢీకొట్టే ముందు హీరోలోకి ఎనర్జీని పంప్‌ చేసే సందర్భమది. అతడిలోని మాసిజానికి ఊపిరి పోసే టైమ్‌ అది. అందుకే అలా ముద్దిచ్చేసిందన్నమాట! థియేటర్‌ లో ఉన్న కుర్రకారంతా పరిపరివిధాలా ఆలోచించుకునేలా డైలమాలో పడిపోయేలా చేసిందీ పెదవి ముద్దు. ప్చ్‌.. ప్చ్‌..ప్చ్‌..