Begin typing your search above and press return to search.

ఆ నలుగురి గురించి రకుల్ పంచ్

By:  Tupaki Desk   |   29 Nov 2018 9:38 PM IST
ఆ నలుగురి గురించి రకుల్ పంచ్
X
ఈ మధ్య టాలీవుడ్ లో జోరు తగ్గినా తమిళ్ లో మాత్రం క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. మొన్నటి దాకా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి సరసన వరసబెట్టి చేసిన రకుల్ కు పోటీ వల్లనో లేక దర్శక నిర్మాతలు మార్పు కోరుకోవడం వల్లనో కాని మొత్తానికైతే స్పీడ్ కు కాస్త బ్రేక్ పడిన మాట వాస్తవం. అయితే హిందిలో కూడా చెప్పుకోదగ్గ అవకాశాలు వస్తుండటంతో రకుల్ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచడమే కాదు బాడీ ఫిట్నెస్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా ఉత్సవంలో పాల్గొన్న రకుల్ అందులో భాగంగా ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొంది. ఊహించని విధంగా యాంకర్ నుంచి ఓ ప్రశ్న ఎదురైతే ఏ మాత్రం తడుముకోకుండా స్మార్ట్ గా చెప్పిన సమాధానం అందరిని ఆకట్టుకుంది. విషయానికి వస్తే పరిశ్రమ మొత్తం ఆ నలుగురి చేతిలోనే ఉందని బయట అందరు అంటూ ఉంటారు కదా దీనికి మీరేమంటారు అనేది యాంకర్ ప్రశ్న. ఇందులో వాస్తవముందన్న రకుల్ దానికో మంచి రీజన్ చూపెట్టింది. దశాబ్దాల నుంచి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అలా అనిపించడం సహజమని చెప్పింది.

అంతే కాదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీకి వచ్చి ప్రూవ్ చేసుకునే స్కోప్ ఎప్పటికి ఉంటుందని చెప్పి విజయ్ దేవరకొండను ఉదాహరణగా చెప్పడంతో అందరు షాక్ తో కూడిన ఆనందానికి గురయ్యారు. ఒకపక్క నిజాన్ని ఒప్పుకుంటూనే మరోవైపు టాలెంట్ ఉంటే అడ్డు ఎవరు అని గడుసుగా చెప్పడంతో అందరు చప్పట్లు కొట్టేసారు. అన్నట్టు రకుల్ మాటల్లో పరమార్థం విజయ్ సరసన నటించేందుకు ఓ ఛాన్స్ వచ్చేందుకా అనే గుసగుసలు కూడా వినిపించాయి లెండి. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టడం అంటే ఇదే మరి