Begin typing your search above and press return to search.

అలా చాటుగా దాచేస్తే అందం దాగునా?

By:  Tupaki Desk   |   25 Aug 2021 12:30 PM GMT
అలా చాటుగా దాచేస్తే అందం దాగునా?
X
అందం ఎంత‌గా దాచుకుంటే అంత‌గా క‌వ్విస్తుంది. చూస్తుంటే ర‌కుల్ కి ఈ టెక్నిక్ బాగానే అల‌వ‌డింద‌నిపిస్తోంది. ఈ బ్యూటీ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌కు వేడెక్కించే ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే హ‌ద్దు మీరిన గ్లామ‌ర‌స్ ఫోటోల‌కు కామెంట్లు అంతే ఘాటుగా ఉంటున్నాయి. అందుకేనేమో.. కాస్త అందాల‌ను దాచేసేందుకు శ్ర‌మిస్తోంది.

తాజాగా ర‌కుల్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అగ్గి రాజేస్తోంది. ర‌కుల్ ఎంతో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే ఎద అందాలను నైసుగా చూపిస్తున్న తీరు కుర్ర‌కారును ఆక‌ర్షిస్తోంది. అలా బ్రౌన్ ఇన్న‌ర్ ధ‌రించి దానిపై కాంబినేష‌న్ ష‌ర్ట్ తో క‌వ‌ర‌ప్ చేసిన తీరు ఆక‌ట్టుకుంది. అలా ర‌కుల్ క్రీగంటి చూపుల‌తో గుండెను కొల్ల‌గొడుతోంది. ర‌కుల్ న‌టించిన కొండ‌పొలం రిలీజ్ కి రావాల్సి ఉంది. ఇటీవ‌లే ఈ మూవీ నుంచి ఓబుల‌మ్మ లుక్ రిలీజ్ చేయ‌గా ర‌కుల్ డీగ్లామ‌ర‌స్ పాత్ర‌పై అభిమానుల‌కు ఒక అవ‌గాహ‌న క‌లిగింది.

కొండ‌పొలంలో ఓబులమ్మ గుట్టు తెలిసే

పంజా వైష్ణవ్ తేజ్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం `కొండ‌పొలం`లో ర‌కుల్ ప్రీత్ సింగ్ లుక్ ఆస‌క్తిని పెంచింది. ఈ చిత్రంలో ఓబులమ్మ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ ఇటీవ‌ల విడుద‌ల కాగా అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. కొండ కోన‌ల్లో గొర్రెల కాప‌రి అయిన వైష్ణ‌వ్ ని ప్రేమించే ఓబుల‌మ్మ క‌థాంశ‌మిదని అర్థ‌మ‌వుతోంది. ఒక పాటలోని చిన్న పాటి విజువ‌ల్ ని ఆవిష్క‌రించ‌గా అది ఎంతో మనోహ‌రంగా హృద‌యాల్ని తాకింది. ప్రేయ‌సీ ప్రియులు కొండ‌పొలంలో ఎంతో మురిపెంగా ఒక‌రికోసం ఒక‌రు అన్న‌ట్టు గా ప్రేమైక జీవ‌నంలో ఉన్నారు. వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ జంట ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. ర‌కుల్ ని ఆప్యాయంగా కౌగిలించుకుని నుదుటిపై ముద్దాడుతున్న ప్రియుడిగా వైష్ణ‌వ్ క‌నిపిస్తున్నాడు. ఈ జంట‌ తెరపై రీఫ్రెషింగ్ గా కనిపిస్తోంది. రకుల్ హాఫ్ శారీలో పల్లెటూరి భామ‌గా కనిపిస్తుంది. కీరవాణి తన సంగీతంతో మళ్లీ మ్యాజిక్ చేయ‌నున్నార‌ని ట్యూన్ చెబుతోంది.

సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి రాసిన నవల నుండి స్వీకరించిన అద్భుతమైన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇది కొండ కోన‌ల్లోని విలేజ్ నేప‌థ్యంలో అడ్వెంచ‌ర‌స్ మూవీగా చెబుతున్నారు. మాస్టర్ లెన్స్‌మ్యాన్ జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ ప్ర‌త్యేక ఆకర్ష‌ణ కానుంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొంతమంది ప్రముఖ నటులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. `ఎపిక్ టేల్ ఆఫ్ బికమింగ్` అనేది కొండపొలం ట్యాగ్ లైన్‌. అక్టోబర్ 8న విడుదల కానుంది.

ఈ సినిమాతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్ .. కాజ‌ల్ తో క‌లిసి క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న భార‌తీయుడు 2లోనూ న‌టిస్తోంది. లైకాతో శంక‌ర్ వివాదాల వ‌ల్ల ఈ సినిమా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ర‌కుల్ బాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇక‌పై వెబ్ సిరీస్ ల వైపు బిగ్ ప్లాన్ తో ముందుకు సాగుతోంద‌ని తెలిసింది.