Begin typing your search above and press return to search.

బొప్పాయి ఆకులా మారిపోయిన ర‌కుల్

By:  Tupaki Desk   |   28 Aug 2022 9:22 AM IST
బొప్పాయి ఆకులా మారిపోయిన ర‌కుల్
X
గ‌డిచిన కొంత‌కాలంగా ర‌కుల్ పాట్లు చూస్తున్న‌వే. ఉన్న‌ట్టుండి బ‌క్క‌ప‌లుచ భామ‌గా మారిపోయింది. జీరో సైజ్ నుంచి మైన‌స్ లోకి వెళ్లిపోయింది. అభిమానులు కూడా ఎవ‌రీమె? అని ప్ర‌శ్నించే ప‌రిస్థితి. అంత‌గా బ‌క్క‌చిక్కి శ‌ల్య‌మైపోయింది.

అయితే చక్క‌న‌మ్మ ఎంత చిక్కితే అంత అందంగా ఉంటుంది అనుకోవాలా? దానికి ఆస్కార‌మే లేదు. నిజానికి ర‌కుల్ బొద్దుగా ఉన్నప్పుడే ఎంతో అందంగా ఉంది. ఇంత‌కుముందు ధృవ సినిమా కోసం ప‌ర్ఫెక్ట్ ఫిజిక్ మేకోవ‌ర్ తో క‌నిపించింది. ప‌రేషాను చేసావురా..! అంటూ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఎంతో అందంగా క‌నిపించింది. కానీ ఇప్పుడు బాగా నీర‌సించి క‌నిపిస్తుంటే అభిమానులు ఈ రూపాన్ని హ‌ర్షించ‌లేక‌పోతున్నారు.

అయినా త‌గ్గాలి గాని ఎవ‌రైనా కుంగిపోకూడ‌దు. మ‌రీ ఇలా ర‌కుల్ తిండి మానేసి జిమ్ లో గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చిస్తూ శ్ర‌మించడం త‌గ‌దేమో! అని కూడా సెల‌విస్తున్నారు కొంద‌రైతే. అవ‌కాశాలు త‌గ్గినంత మాత్రాన ఇలా పూర్తిగా టీనేజ‌ర్ లుక్ కి మారిపోవాలంటే కుద‌ర‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌కుల్ చాలా శ్ర‌మించింది. దానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం అందుకుంది. కానీ ఇది మ‌రీ అతిగా మార‌క ముందే జాగ్ర‌త్త ప‌డాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇన్ స్టాలో ఇటీవ‌ల ర‌కుల్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు చూస్తే మ‌రీ లీన్ గా క‌నిపిస్తోంది. ఆ ఫోటోలు చూశాక అభిమానులు కంగారు ప‌డిపోతున్నారు. ఇదివ‌ర‌కూ పింక్ ఫ్రాక్ లో ర‌కుల్ కొన్ని బొప్పాయి చెట్ల ముందు ఫోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఈ ఫోటోల‌ను చూడ‌గానే.. బొప్పాయి ఆకులా మారిపోయిన ర‌కుల్ అంటూ అభిమానులు కామెంట్లు చేసారు. మ‌రీ అంత బ‌క్క‌ప‌లుచ‌గా మారిపోయింది ఈ పంజాబీ బ్యూటీ.

ప్ర‌యోగాలు ఆప‌ని బ్యూటీ...

ఇటీవ‌ల‌ ర‌కుల్ `మషూకా` సాంగ్ లో త‌న‌వైన స్టెప్పుల‌తో అలరించింది. ఈ వీడియో హిందీలో విడుదలైంది. విజువల్స్.. కొరియోగ్రఫీ .. సాహిత్యం ఇలా ప్ర‌తిదీ దేనిక‌దే ప్ర‌త్యేకంగా క‌నిపించాయి. తనిష్క్ బాగ్చి సంగీతం అందించిన ఈ ఆల్బ‌మ్ తెలుగు- -తమిళ భాషల్లోను విడుద‌లైంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ర‌కుల్ ఇటీవల అజయ్ దేవగన్ `రన్ వే 34` ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. త‌దుప‌రి చత్రివాలి స‌హా ప‌లు చిత్రాల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌లే తాను ఇష్ట‌ప‌డిన న‌టుడు కం నిర్మాత జాకీ భ‌గ్నానీతో డేటింగ్ లో ఉన్నానంటూ చెప్పింది. అత‌డు నిర్మిస్తున్న సినిమాల్లోనూ ర‌కుల్ భాగ‌మ‌వుతోంది. అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ జోడీ ది లేడీ కిల్లర్స్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తోంది. ఈ ముగ్గురూ తమ తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నారు. `మేరీ పత్నీ కా రీమేక్` అనే తాత్కాలిక టైటిల్ వైర‌ల్ అవుతోంది. `హ్యాపీ భాగ్ జాయేగీ` దర్శకుడు ముదస్సర్ అజీజ్ మొదటిసారిగా అర్జున్- ర‌కుల్ బృందంతో ప‌ని చేస్తున్నారు. ఇది క్రేజీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్.

ఇంత‌కుముందు`సర్దార్ కా గ్రాండ్ సన్` లో అర్జున్ కి ప్రియురాలిగా ర‌కుల్ న‌టించింది. తాజా చిత్రం 90ల నాటి గోవిందా కామెడీ నాస్టాల్జిక్ మెమరీగా రూపొందుతుండ‌గా ర‌కుల్ కి మ‌ళ్లీ అర్జున్ స‌ర‌స‌న‌ ఛాన్స్ ద‌క్కింది. పూజా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వాసు భగ్నాని నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక నిర్మాత జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ అత‌డి సొంత కుటుంబ బ్యాన‌ర్ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మాషూకా వీడియో ఆల్బ‌మ్ ని భ‌గ్నానీలు నిర్మించారు.