Begin typing your search above and press return to search.

ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అమ్మ‌డూ!

By:  Tupaki Desk   |   15 July 2022 11:00 AM IST
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలి అమ్మ‌డూ!
X
సోష‌ల్ మీడియాల్లో ర‌కుల్ జోరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పోటీబ‌రిలో యంగ్ జ‌న‌రేష‌న్ తో పోటీప‌డుతూ దూసుకుపోతోంది. నిరంతరం ఈ ఫిట్ నెస్ ఫ్రీక్ త‌న అందాన్ని ఎలివేట్ చేసే వ‌రుస ఫోటోషూట్ల‌తో దుమారం రేపుతోంది. తాజాగా ర‌కుల్ హాట్ లుక్ ఒక‌టి ఇన్ స్టాలోకి దూసుకొచ్చింది. దీనికి ర‌కుల్ ఇచ్చిన క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంది. ఎక్క‌డ చ‌దువుకున్నామో అక్క‌డ అంతెత్తుకు...! అంటూ త‌న టాలెస్ట్ లుక్ తో ఆక‌ట్టుకునే ఫోటోని షేర్ చేసింది. తాజా ఫోటోషూట్ తాను విధ్యాధికురాలు అయిన స్కూల్ కాలేజ్ ప‌రిస‌రాల్లో చేసిన‌ది అని అర్థ‌మ‌వుతోంది. అయితే ర‌కుల్ ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ త‌న‌లోని ఆ డౌన్ టు ఎర్త్ స్వ‌భావం టాలీవుడ్ లో అంద‌రికీ న‌చ్చుతుంది. అందుకే త‌న‌కు ఇంకా ఇక్క‌డ అవ‌కాశాలొస్తున్నాయి. వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ రాక ముందు ర‌కుల్ త‌న ఇంట‌ర్వ్యూల కోసం తెలుగు మీడియాని అభ్య‌ర్థించేది. ఇప్ప‌టికీ అదే డౌన్ టు ఎర్త్ స్వ‌భావాన్ని క‌లిగి ఉంది.

కొంత‌కాలంగా ర‌కుల్ ప్రీత్ పై ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. ఇన్నాళ్లు తెలుగులో అగ్ర‌నాయిక‌గా కొన‌సాగిన ర‌కుల్ కి ఇక టైమ్ అయిపోయింద‌ని అందుకే టాలీవుడ్ లో కనిపించకుండా పోయింద‌ని ప్ర‌చార‌మైంది. ర‌కుల్ క‌నిపించ‌క‌ తెలుగు అభిమానులు నిరుత్సాహానికి గురవుతుండగా తాను ఎందుకు ఇక్క‌డ‌ పెద్దగా నటించడం లేదనే విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు.. తాను తెలుగు సినిమాలు చేయడం లేదని తేల్చి చెప్పింది. భాష స‌మ‌స్య‌ కాదు.. స్క్రిప్ట్ ప‌ర‌మైన స‌మ‌స్య అని ర‌కుల్ టూకీగా చెప్పింది.

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉంది. ఎప్పుడో కుదిరిన‌ప్పుడు తెలుగు సినిమా చేస్తుంది. ర‌కుల్ న‌టించిన చివ‌రి చిత్రం `కొండపొలం` ఫ్లాప్ అయిన సంగ‌తి తెలిసిందే. 2020-21 త‌ర‌వాత‌ టాలీవుడ్ లో ఆమె కనిపించకుండా పోవడంతో దానిపై చ‌ర్చ సాగుతోంది. అయితే దీనిపై అభిమాని ప్ర‌శ్న‌కు ర‌కుల్ తాజాగా స్పందించింది.

ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్ లో రకుల్ ప్రీత్ సింగ్ తాను తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదు! అనే దాని గురించి ఓపెనైంది. ``మీరు ఏదైనా తెలుగు సినిమా చేస్తారా లేదా మీరు హిందీ సినిమాలకు మాత్రమే కట్టుబడి ఉండాలనుకుంటున్నారా? అంటూ ఏడుస్తున్న ఎమోటికాన్ తో ప్ర‌శ్నించాడు. దానికి ఆమె ఒక వీడియో సందేశాన్ని అందించింది. ``లేదు.. నేను తెలుగు సినిమా చేస్తాను. విభిన్నంగా ఏదైనా చేయాలని ఎదురుచూస్తున్నాను. నిజంగా నన్ను సవాల్ చేసే ఆఫ‌ర్ కావాలి. హిందీలో ప్రస్తుతం వ‌రుస‌ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాను.. కానీ నాకు భాష స‌మ‌స్య కాదు.. స్క్రిప్ట్ స‌మ‌స్య‌`` అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ 2011లో కెరటం అనే సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ప్ర‌భాస్ క‌జిన్ రాజ్ కుమార్ ఇందులో హీరో. కొన్నేళ్లలోనే అగ్ర నాయిక‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (2013) ఘ‌న‌విజ‌యం త‌ర్వాత‌ లౌక్యం (2014)- పండగ చేస్కో (2015)- సరైనోడు (2016)- ధృవ (2016)- రారండోయ్ వేడుక చూద్దాం (2017)- స్పైడర్ వంటి చిత్రాల్లో న‌టించింది. తెలుగు - తమిళంలో అగ్ర‌నాయిక‌గా దూసుకెళ్లింది.

రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్ `భారతీయుడు 2` లో ఒక నాయిక‌గా న‌టిస్తోంది. కానీ ఈ మూవీ ర‌క‌ర‌కాల‌క కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ని మళ్లీ ప్రారంభించాలని భావిస్తున్నారు. త‌దుప‌రి శివకార్తికేయన్ తో అయాలన్ అనే తమిళ సినిమా కూడా చేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నా ఈ సినిమా ఇంకా ఎందుకు ప్రేక్షకుల ముందుకు రాలేదో తెలియాల్సి ఉంది.

బాలీవుడ్ లో ర‌కుల్ క్రేజ్ కొన‌సాగుతోంది. 2022లో ప‌లు క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో కొన్ని త‌న గేమ్ ని ఛేంజ్ చేస్తాయ‌ని ర‌కుల్ భావిస్తోంది. ఆయుష్మాన్ ఖురానా- షెఫాలీ షాతో క‌లిసి డాక్టర్ జి అనే సామాజిక డ్రామా మూవీలో క‌థానాయిక‌గా నటిస్తోంది. ఈ ఏడాది దీపావళికి విడుదల కానున్న అజయ్ దేవగన్ -సిద్ధార్థ్ మల్హోత్రా- ఇంద్ర కుమార్ ల‌ కామెడీ చిత్రం `థాంక్ గాడ్‌`లో ర‌కుల్ కనిపిస్తుంది.