Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ర‌కుల్ ఎక్క‌డా త‌గ్గేదేలే ..!

By:  Tupaki Desk   |   27 Feb 2022 10:00 PM IST
ఫోటో స్టోరి: ర‌కుల్ ఎక్క‌డా త‌గ్గేదేలే ..!
X
అందాల ఆర‌బోత‌కు న‌వ‌త‌రం అడ్డు చెప్ప‌డం లేదు. కాస్త సీనియ‌ర్ నాయిక అయిన ర‌కుల్ ప్రీత్ కూడా త‌గ్గేదేలే! అంటూ చెల‌రేగుతోంది. నేటిత‌రం నాయిక‌లు జాన్వీ క‌పూర్ - అన‌న్య - సారా అలీఖాన్ లాంటి వారితో పోటీప‌డుతోంది. ఈ బ్యూటీ ఇంత‌కుముందు మాల్దీవుల విహారంలో చెల‌రేగింది. తాజాగా మ‌రోసారి హాటెస్ట్ ఫోటో ఒక‌టి షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఈ ఫోటోగ్రాఫ్ ని బ‌ట్టి ర‌కుల్ పూర్తిగా బీచ్ వెకేష‌న్ మోడ్ లో ఉంది. బికినీలో అందాల్ని ఆర‌బోస్తోంది. అలా టాప్ తో కాస్త క‌వ‌రింగ్ చేసినా కానీ దాగ‌లేనంటున్న అందాలు దోర‌దోర‌గా వ‌ల‌పు దోపిడీ చేస్తున్నాయి.

ఇక ఈ విహార యాత్ర ప్రియుడితోనేనా? అంటే.. క‌చ్ఛితంగా ఔన‌నే చెప్పాలి. న‌టుడు కం నిర్మాత‌ జాకీ భగ్నానీతో సంబంధంపై రకుల్ ప్రీత్ సింగ్ అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బంధం అనుబంధం గురించి దాచడానికి లేదా మోసగించడానికి ఏమీ లేదని ఇటీవలి ఇంటర్వ్యూలో అంది.

రకుల్ ప్రీత్ సింగ్ తాను బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ఇద్దరూ పబ్లిక్ గా సంబంధాన్ని అంగీకరించామ‌ని అంది. ఈ జోడీ తమ సంబంధాన్ని అక్టోబర్ లో బహిరంగపరిచారు. ఆ త‌ర్వాత హ‌ద్దులు చెరిపేసిన విహార యాత్ర‌లతో ఆస్వాధ‌న‌లో ప‌డ్డారు.

అక్టోబర్ లో రకుల్ పుట్టినరోజు సందర్భంగా జాకీ పోస్ట్ తో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌గా ఆపై రకుల్ ప్రతిస్పందనతో ఇద్దరూ ఇన్ స్టాలో అధికారికంగా వెల్ల‌డించారు. అందులో ఆమె జాకీని తన `అతిపెద్ద బహుమతి` అని చెబుతూ ఆనందం వ్య‌క్తం చేసింది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రకుల్ తమ రిలేషన్ షిప్ విష‌యంలో ఎందుకు పబ్లిక్ అవ్వాల‌నుకున్నారో చెప్పింది. సంబంధం గురించి దాచడానికి లేదా మోసగించడానికి ఏమీ లేదని మా ఇద్దరి అభిప్రాయం. మీరు ప్రేమ‌లో ఉంటే.. ఒకరికొకరు ఆ గౌరవాన్ని ఇవ్వడం దానిని గుర్తించడం ఉత్తమం.

దేనినైనా ఎదుర్కొందాము... దాగుడుమూతలతో అటూ ఇటూ పరిగెత్తే జంటలు ఎవరో మనందరికీ తెలుసు. మేమిద్దరం ఆ ఆలోచనల నుండి వచ్చిన వాళ్లం కాదు'' అని రకుల్ అనుపమ చోప్రాతో చాటింగ్ లో అన్నారు.

ఆమె కోసం జాకీ పుట్టినరోజు పోస్ట్ గురించి మాట్లాడుతూ,.. అందులో అతను ఆమెను ప్రశంసిస్తూ కవితలు రాసాడు. తన బాయ్ ఫ్రెండ్ వైపు చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని రకుల్ చెప్పింది. "అతను కవి అవుతాడని నాకు తెలియదు. అతను నన్ను బహిరంగంగా విష్ చేయబోతున్నాడని నాకు తెలుసు కానీ అది `పుట్టినరోజు శుభాకాంక్షలు` మాత్ర‌మేన‌ని నేను అనుకున్నాను. ఇది అంత కవితాత్మక సందేశం అవుతుందని నాకు తెలియదు. నేను చాలా ఆశ్చర్యపోయాను" అని చెప్పింది.

జాకీ తమ సంబంధాన్ని బహిరంగపరిచినప్పటికీ ర‌కుల్ ఆ త‌ర్వాత‌ తన పనిపై దృష్టి పెట్టలేద‌ని కూడా చెప్పింది. “ఇది నా జీవితంలో ఒక భాగం.. నాకు నా తల్లిదండ్రులు నా సోదరుడు ఉన్నట్లే నా జీవితంలో నాకు ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. నేను దాని గురించి వార్తల్లోకి రావాల‌నుకోవ‌డం లేదు. అతను కూడా అనుకోవ‌డం లేదు`` అని కూడా వెల్ల‌డించింది.

ర‌కుల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల్లో న‌టిస్తోంది. 2022లో రెండు భాషల్లో ఏడు విడుదలలను కలిగి ఉంది. వీటిలో అజయ్ దేవగన్ తో రన్‌వే 34... ఆయుష్మాన్ ఖురానా సరసన డాక్టర్ జి... జాన్ అబ్రహం - జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి `ఎటాక్` చిత్రాల్లో న‌టించ‌గా ఇవ‌న్నీ విడుద‌ల‌వుతున్నాయి.

ఎటాక్ పార్ట్ 1 ఏప్రిల్ లో విడుద‌ల‌వుతుంది. త‌దుప‌రి కొన‌సాగింపు కూడా ఉంటుంది. సోలో లీడ్ గా ర‌కుల్ మొదటి చిత్రం-ఛత్రివాలి త‌దుప‌రి రిలీజ్ కి వ‌స్తుంది. సౌత్ లో భార‌తీయుడు 2లో ర‌కుల్ న‌టిస్తోంది.