Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ లుక్ లో ర‌ఫ్ఫాడించిన ర‌కుల్

By:  Tupaki Desk   |   5 Nov 2021 6:00 AM IST
రెడ్ హాట్ లుక్ లో ర‌ఫ్ఫాడించిన ర‌కుల్
X
వ‌రుస ఫోటోషూట్ల‌తో ర‌ఫ్ఫాడిస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఓవైపు బాలీవుడ్ లో న‌టిస్తూనే మ‌రోవైపు సౌత్ ని బ్యాలెన్స్ చేస్తున్న ఈ బ్యూటీ ఇన్ స్టా మాధ్య‌మంలో నిరంత‌రం ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని అసాధార‌ణంగా పెంచుకుంటోంది.

తాజాగా ర‌కుల్ రెడ్ హాట్ లుక్ అంతర్జాలంలో వైర‌ల్ గా మారింది. రితి రాహుల్ షా డిజైన్ చేసిన రెడ్ ఫ్యాంట్ షూట్ లో కిల్ల‌ర్ బ్యూటీనే త‌ల‌పిస్తోంది. ర‌కుల్ ఫ్రీ హెయిర్ స్టైల్.. రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో బెలూన్ స్లీవ్స్ తో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఇండ‌స్ట్రీ ప్లేయ‌ర్ లా బోల్డ్ లుక్ తో ర‌కుల్ ఆక‌ట్టుకుంది. ఎంపిక చేసిన మేక‌ప్ రెడ్ బ్యాక్ గ్రౌండ్ కి త‌గ్గ‌ట్టుగా ప‌ర్ఫెక్ట్ గా కుదిరింది. ఇక ఇటీవల ర‌కుల్ షేపులు మారిపోయాయి! అంటూ ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. తాజా ఫోటోషూట్ల‌తో అది రాంగ్ అని మ‌రోసారి ప్రూవ్ అయ్యింది.

ర‌కుల్ న‌టించిన కొండ‌పొలం ఇటీవ‌లే విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ చిత్రంలో వైష్ణ‌వ్ తేజ్- ర‌కుల్ జంట న‌ట‌న‌కు చ‌క్క‌ని ప్ర‌శంస‌లు కురిసాయి. త‌దుప‌రి క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2లో క‌నిపించ‌నుంది. వివాదాల వ‌ల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. 2022లో పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు లైకా సంస్థ ఇటీవ‌ల శంక‌ర్ తో మంత‌నాలు సాగిస్తోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అటు త‌మిళంలో ఆల‌యాన్ అనే చిత్రంలో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న ర‌కుల్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.