Begin typing your search above and press return to search.

మినీ స్కర్ట్ లో ఇంకా హైస్కూల్ పాప అనుకుంటోందా!

By:  Tupaki Desk   |   12 July 2021 9:00 PM IST
మినీ స్కర్ట్ లో ఇంకా హైస్కూల్ పాప అనుకుంటోందా!
X
సౌత్ లో అరుదైన ఫ్యాష‌నిస్టాగా ర‌కుల్ ప్రీత్ సింగ్ పేరు మార్మోగుతోంది. ప‌ర్ఫెక్ట్ టోన్డ్ బాడీ తీరైన దేహ‌శిరుల‌తో ఈ పంజాబీ బ్యూటీ ఏడెనిమిదేళ్లుగా ఇండ‌స్ట్రీలో హ‌వా సాగిస్తోంది. ఇక నేటిత‌రం మెచ్చే ట్రెండీ డిజైన‌ర్ లుక్ ని ప‌రిచ‌యం చేయ‌డంలోనూ ర‌కుల్ త‌ర్వాతే ఎవ‌రైనా.

తాజాగా అందాల ర‌కుల్ కూల్ గా మినీ స్కర్ట్ లో ప్ర‌త్య‌క్ష‌మై కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. పెరివింకిల్ క్రాప్ టాప్ - మినీ స్కర్ట్ కాంబినేష‌న్ డిజైన‌ర్ డ్రెస్ లో ర‌కుల్ ఫోజులు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. ఇంత‌కుముందు ర‌కుల్ బొద్దుగా క‌నిపించేది. కానీ ఇటీవ‌ల జిమ్ లో క‌ఠోరంగా శ్ర‌మించి పూర్తిగా సైజ్ జీరోకి మారిపోయింది. ఇక మారిన రూపానికి త‌గ్గ‌ట్టే త‌న దేహ‌శిరుల‌ను టైట్ గా హ‌గ్ చేసుకున్న ఈ మిడ్డీ డ్రెస్ త‌న అందాన్ని ప‌దింత‌లు పెంచింది. ఈ ఫోటో షూట్ ని ఇలా సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గానే.. ఇంకా నేను హైస్కూల్ పాప‌నే అన్న‌ట్టుగా...! ఉంది ఈ లుక్ అంటూ యూత్ ఒక‌టే కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ బ‌హు భాష‌ల్లో బిజీగా ఉన్నారు. ఆమె ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ప్రమోషన్స్ కోసం తేలికపాటి డిజైన‌ర్ లుక్ ని ఎంపిక చేసుకుంది. పొట్టి ప‌రికిణీతో ఈ కో-ఆర్డర్ సెట్ దో-నట్స్ హనీ దుస్తులు లైన్ నుండి మార్కెట్లో దిగింది. దీని విలువ 6499 రూపాయలు మాత్ర‌మే. అలాగే రూ .2800 విలువైన అజ్గా దుకాణం నుండి పొడవైన గుండె ఆకారపు ముత్యాల చెవిరింగులను ర‌కుల్ సేక‌రించింది. మైరా బ్రాండ్ నీలిరంగు స్నీకర్ల విలువ రూ .2000.. సింపుల్ అలంకరణతో ర‌కుల్ గుండెల్ని ట‌చ్ చేస్తోంది.

ఇక కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ర‌కుల్ ఇటీవ‌ల ప్ర‌యోగాల బాట‌లో వెళుతోంది. క్రిష్ తో కొండ‌పొలం గ్రీన‌రీ నేప‌థ్యంలో ప్ర‌యోగం. ఓవైపు రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తూనే ఈసారి కొత్త ఎటెంప్ట్ చేస్తోంది ర‌కుల్. ప్ర‌ఖ్యాత నిర్మాత రోనీ స్క్రూవాలా తెర‌కెక్కించే త‌దుప‌రి చిత్రంలో ర‌కుల్ కండోమ్ టెస్ట‌ర్ పాత్ర‌లో న‌టించ‌నుంది. ఇది పూర్తి హాస్య‌ప్ర‌ధాన చిత్రం. నాయికా ప్రాధాన్య‌త‌తో తెర‌కెక్క‌నుంద‌ని తెలిసింది. సామాజిక సందేశం కూడా ఉంటుంది. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రంలో ర‌కుల్ పాత్ర నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచే విధంగా ఉంటుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

బాలీవుడ్ లో సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాతో డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ లతో కలిసి `మేడే` షూటింగ్ లోనూ ర‌కుల్ పాల్గొంటోంది. ఇటీవ‌ల‌ సెకండ్ వేవ్ వ‌ల్ల బాలీవుడ్ షూటింగులు బంద్ అయిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గానే తిరిగి సెట్స్ కి వెళుతూ రకుల్ కెమెరా కంటికి చిక్కుతోంది. విమానాశ్ర‌యాల్లో హ‌డావుడిగా ప్ర‌యాణాలతో గ‌జిబిజీగా ఉంటోందిట పాపం. మే డే- థాంక్స్ గాడ్- డాక్టర్ జి- ఎటాక్ వంటి చిత్రాల‌పై రకుల్ ప్రీత్ సింగ్ చాలా హోప్స్ పెట్టుకుంది. వీటిలో స‌గం విజ‌యం సాధించినా త‌న రేంజు మ‌రో లెవ‌ల్ కి చేరుకుంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు.

9ఏళ్ల‌లో ఎన్నో ఒడిదుడుకులు:

2013లో ర‌కుల్ `వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసిందే లేదు. మ‌హేష్ స‌ర‌సన `స్పైడ‌ర్`.. చ‌ర‌ణ్ స‌ర‌స‌న `ధృవ‌`.. `బ్రూస్ లీ`.. నాగార్జున `మ‌న్మ‌ధుడు 2` వంటి భారీ చిత్రాల్లో న‌టించింది. అయితే అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించిన వేవీ త‌న‌కు ఆశించినంత‌గా క‌లిసి రాక‌పోవ‌డంతో కొంత‌వ‌ర‌కూ కెరీర్ ప‌రంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న ర‌కుల్ ఇటీవ‌ల తిరిగి అనూహ్యంగా పుంజుకుని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.