Begin typing your search above and press return to search.

యోగా మ్యాట్ తో ఫ్యాష‌నిస్టా దొరికిపోయిందిగా

By:  Tupaki Desk   |   19 March 2021 10:00 PM IST
యోగా మ్యాట్ తో ఫ్యాష‌నిస్టా దొరికిపోయిందిగా
X
అందాల ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో న‌టిస్తూనే బాలీవుడ్ లోనూ వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. ఇటీవ‌లే క‌రోనా నుంచి కోలుకుని తిరిగి యోగా జిమ్ అంటూ ఆరోగ్యం ప‌రంగా పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇక ముంబై లో జిమ్ కి వెళ్లినా.. మార్కెట్ కి వెళ్లినా వీధుల్లో ర‌కుల్ హంగామా ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ర‌కుల్ యోగా సెష‌న్స్ యూత్ లో హాట్ టాపిక్. ఇక జిమ్ యోగాకి వెళితే ఇలా ప్ర‌త్యేకించి టైట్ ఎలాస్టిక్ స్పోర్ట్స్ దుస్తుల్లో యూత్ కి ట్రీటిస్తోంది.

తాజాగా యోగా మ్యాట్ తో యోగా సెష‌న్స్ కి బ‌య‌ల్దేరిన‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఓవైపు ఫోన్ లో అదే ప‌నిగా మాట్లాడుతున్న ర‌కుల్ టైట్ ఫిట్ లో స్లిమ్ గా క‌నిపిస్తోంది. ఫిట్నెస్ ప‌రంగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంద‌రికో స్ఫూర్తి. నిరంత‌రం జిమ్ యోగాభ్యాసం టిప్స్ ని అందిస్తోంది ఈ భామ‌. ఫిట్ ‌నెస్ లో త‌న‌ని మించిన‌ ప్రేరణ వేరొక‌రు లేర‌నే చెప్పాలి.

రకుల్ ప్రీత్ సింగ్ కు COVID-19 పాజిటివ్ అని తేలాక వైద్యంతో కేవ‌లం 10 రోజుల్లోనే కోలుకొని తిరిగి షూటింగుల్లో చేరింది. ఆ వెంటనే తన ఫిట్నెస్ దినచర్యను ప్రారంభించింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కమల్ హాసన్ `ఇండియన్ 2` లో రకుల్.. కాజ‌ల్ తో పాటు న‌టిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా.. అజయ్ దేవ్‌గన్ కలిసి నటించిన థాంక్స్ గాడ్ రిలీజ్ కి రావాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్ తో క‌లిసి న‌టిస్తున్న‌ మేడే (అజయ్ దేవ్‌గన్) స‌గ‌భాగం పూర్త‌యింద‌ని తెలుస్తోంది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కొండ‌పొలం పుస్త‌కం ఆధారంగా రూపొందించిన చిత్రంలో న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా రిలీజ్ కి రానుంది.