Begin typing your search above and press return to search.
రకుల్ కాపీ క్యాట్ వ్యవహారం గుట్టు లీకైందిలా
By: Tupaki Desk | 17 July 2021 12:05 PM ISTవారాంతానికి బెస్ట్ ఫ్యాషన్ ఎంపిక ఏది? అంటే.. చాలా మంది సెలబ్రిటీలు ఏదైనా యూనిక్ గా ఉండే డిజైనర్ దుస్తులను ధరించేందుకు ఆసక్తిని కనబరుస్తారు. ఇంతకుముందు ఆలియా.. పూజా హెగ్డే ఒకే తరహా దుస్తుల్లో దర్శనమిచ్చారు. సమంత చాలా సార్లు దీపిక.. అనుష్క శర్మ ఎంపిక చేసుకునే డిజైనర్ లుక్ ని ఎంపిక చేసుకుని ఇంచుమించు అదే డిజైన్ తో కనిపించిన సందర్భాలున్నాయి.
ఇప్పుడు ఫ్యాషన్ ఫేసాఫ్ వెటరన్ నాయిక శిల్పాశెట్టి వర్సెస్ మోడ్రన్ నాయిక రకుల్ ప్రీత్ సింగ్ నడుమ కావడం ఆసక్తికరంగా మారింది. శిల్పాజీ కెరీర్ లో చేయని ప్రయోగం లేదు. ఇద్దరు పిల్లల మమ్మీగా ఇప్పటికీ యూత్ ని మురిపిస్తున్న ఈ లేట్ ఏజ్ బ్యూటీ ఇటీవల ఓ స్పెషల్ ఎంపికతో ఆకట్టుకున్నారు. ఇక శిల్పాశెట్టి.. రకుల్ ఇంచుమించు ఒకే విధమైన ఫాబ్రిక్ ను ఎంచుకున్నారు. ఈ రెండిటిలో ఏది బెస్ట్? ఎక్కువమంది ఎవరి ఎంపికను ఇష్టపడతారు?
నిజానికి చీర ఎల్లపుడూ గొప్ప సెలెక్షన్ అనిపిస్తుంది. ఒకవేళ చీరలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వకపోతే ఎల్లప్పుడూ మాక్సి స్కర్ట్స్ .. గౌన్లు లేదా ప్యాంటు ధరించేందుకు ఆసక్తిని కనబరుస్తారు. మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షించేది ఏదైనా అది మీ ఎంపిక. కానీ వాటిని ఎలా స్టైలింగ్ చేస్తారన్నదే ముఖ్యం. బెలూన్ స్లీవ్ లు- ఫాబ్రిక్ బెల్ట్ లు- ఎంబ్రాయిడరీ పని లేదా బ్లౌజ్ లతో ఆ ఇద్దరూ ఒక కరకంగా మ్యాజిక్ చేస్తున్నారు.
శిల్పా శెట్టి కుంద్రా ఎప్పటికీ చీర ను ఇష్టపడతారు. నీలం - తెలుపు ప్రింట్లతో చీరను ధరించి మురిపించారు. రకుల్ ప్రీత్ సింగ్ నీలం - తెలుపు ప్రింట్లతో ఎంబ్రాయిడరీ సరిహద్దులను కలిగి ఉన్న డిజైనర్ లుక్ లో కనిపించారు. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సాగర కన్యగా అలరించిన శిల్పాశెట్టి మళ్లీ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేస్తారా? అంటూ ఒక సెక్షన్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నారు.
బాలీవుడ్ లో సర్దార్ కా గ్రాండ్సన్ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాతో డిజిటల్ అరంగేట్రం చేస్తోంది. అమితాబ్ బచ్చన్- అజయ్ దేవ్ గన్ లతో కలిసి `మేడే` షూటింగ్ లోనూ రకుల్ పాల్గొంటోంది. ఇటీవల సెకండ్ వేవ్ వల్ల బాలీవుడ్ షూటింగులు బంద్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తిరిగి సెట్స్ కి వెళుతూ రకుల్ కెమెరా కంటికి చిక్కుతోంది. విమానాశ్రయాల్లో హడావుడిగా ప్రయాణాలతో గజిబిజీగా ఉంటోందిట పాపం. మే డే- థాంక్స్ గాడ్- డాక్టర్ జి- ఎటాక్ వంటి చిత్రాలపై రకుల్ ప్రీత్ సింగ్ చాలా హోప్స్ పెట్టుకుంది.
ఇలా ఒకే రకమైన డిజైనర్ లుక్ లో కనిపించారంటే ఆ ఇద్దరిలో ఎవరు కాపీ క్యాట్ అన్న సందేహం రావొచ్చు. కానీ ఇక్కడ ఈ రెండూ ఒకే తరహా డిజైనర్ లుక్ ఉన్నవి కావు. రంగుల పరంగా ఉన్నా కానీ అవి వేటికవే ప్రత్యేకం. అలాగే ఆ ఇద్దరికీ ఒకే డిజైనర్ ఇలాంటివి రూపకల్పన చేసి ఉండేందుకు ఆస్కారం లేకపోలేదు. ఆసక్తికరంగా శిల్పాశెట్టి.. రకుల్ ప్రీత్ ఇద్దరినీ తరచి చూస్తూ ఆ ఇద్దరిలో ఎవరు యంగ్ ? అంటూ ఈ ఫోటోలను షేర్ చేస్తుండడం ఆసక్తికరం. శిల్పా శెట్టి ఏజ్ 40 ప్లస్ లో ఉన్నా కానీ ఇంకా 20 ఏజ్ లుక్ తో మైమరిపిస్తున్నారు. ఇక రకుల్ తనతో పోటీపడడం ఆల్మోస్ట్ అసాధ్యం అన్నంతగా మెరుపులు మెరిపిస్తున్నారు.